.webp)
టాప్ తెలుగు ఇన్ ఫ్లూఎన్సర్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక హోస్ట్ రష్మీ మిగతా వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసింది. "ఫస్ట్ లేడీ లక్ష్మి మంచు గారు " "ఓజి వైరల్ స్టార్ వైవా హర్ష గారు " అని చెప్పింది. ఈ షోకి విశ్వభరత్ (ట్రూ ఫిట్ ) ఫేమస్ రాం, సింధు కాసారం (దబిడి దిబిడి) గ్రాండ్ పా కిచెన్ అనిరుద్ నారాయణం, అఖిల్ జాక్సన్, అమృత భూపతిరాజు, గౌతమ్ కుమార్, డయానా వండర్ వుమన్, రవి (యోలో గై ) వంటి ఇన్ ఫ్లూఎన్సర్స్ వచ్చారు. 10 మంది తెలుగు ఇన్ ఫ్లూఎన్సర్స్ జ్యూరీ ఇచ్చే రకరకాల క్యాటగిరీస్ లో కంపీట్ చేస్తారని చెప్పింది రష్మీ. " ఇన్ ఫ్లూఎన్సర్స్ ఎపిసోడ్ లో రక్తాలు చిందించడానికి రెడీగా ఉన్నారు " అని చెప్పింది రష్మీ. ఇంతలో రామ్ అనే ఇన్ ఫ్లూఎన్సర్ వచ్చి "రామ్ అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా నో ఫైర్ " అన్నాడు.
వెంటనే మంచు లక్ష్మి " నేను వైల్డ్ ఫైర్ " అన్నారు. "ఐతే ఏంటి " అన్నాడు రామ్. "మేడంకి వ్యతిరేకంగా వెళ్తే వార్ వన్ సైడ్ అవుతుంది " అంటూ వైవా హర్ష హెచ్చరించాడు. తర్వాత రష్మీ వైవా హర్షకి ఒక టాస్క్ ఇచ్చింది కూర్చుని కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూపించండి అనేసరికి రకరకాల పోజులు ఇచ్చాడు. తర్వాత రవి అనే ఇన్ ఫ్లూఎన్సర్ వచ్చేసరికి వైవా హర్ష ఒక ప్రశ్న అడిగాడు. "నాకు ఒక చిన్న టిప్ ఇవ్వండి రవి. మనం ఏదైనా పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ అవ్వాలి మన దగ్గర డబ్బులు కట్ అవ్వకూడదు " అన్నాడు. దాంతో అందరూ నవ్వేశారు. తర్వాత విశ్వభరత్ (ట్రూ ఫిట్ ) అనే ఫిట్ నెస్ కోచ్ ని లక్ష్మి మంచి ఒక ప్రశ్న అడిగారు. "హే నాకొకటి చెప్పు అడివి శేష్ అసలు వర్కౌట్ చేస్తాడా. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ , షార్ట్స్ వేసుకుని మేనేజ్ చేసేస్తాడా " అన్నారు. ఇంతలో వైరల్ వెంకటేశ్వర్లు వచ్చి హడావిడి చేసాడు. వెంట అనుదీప్ కూడా వచ్చారు. మంచు లక్ష్మి "నెక్స్ట్ ఎం చేస్తున్నారు " అని అనుదీప్ ని అడిగారు. "ఒక లవ్ స్టోరీ రాస్తున్నా " అన్నారు. "అది కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటుందా లేదంటే తేడాగానే ఉంటుందా " అన్నారు. "స్ట్రైట్ గానే ఉండండి "అని చెప్పారు అనుదీప్.





.webp)
