
-లెనిన్ విజయంతో మరోసారి నిజమైన పెళ్లి సెంటిమెంట్
-హిట్ కావాలంటే పెళ్లి చేసుకోవాల్సిందేనా!
-ఫిలిం సర్కిల్స్ లో, అభిమానుల్లో వైరల్ గా మారిన న్యూస్
సెంటిమెంట్.. తెలుగు చిత్ర పరిశ్రమ సెంటిమెంట్ ని నమ్మినంత ఇదిగా మరో రంగం ఉండదంటే అతిశయోక్తి కాదు. పైగా సెంటి మెంట్ కూడా నన్ను నమ్మాల్సిందే అంటూ ఎన్నో ఉదాహరణలని మన ముందు ఉంచుతుంది. ముఖ్యంగా హీరోల విషయంలో. రీసెంట్ బ్లాక్ బస్టర్ లెనిన్(Lenin)నే ఒక ఉదాహరణ. పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలకి వివాహ బంధం గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తోంది. ఈ సరికొత్త సెంటిమెంట్ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారి, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ పెళ్లి సెంటిమెంట్‌కు సరిగ్గా సరిపోయే మొదటి ఉదాహరణ యువ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). వరుస పరాజయాలతో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని వివాహం చేసుకున్నాడు. అంతే పెళ్లి పీటలు ఎక్కిన కొద్ది రోజులకే వచ్చిన 'క' మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో భారీ వసూళ్లను సాధించి, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ భారీ సక్సెస్ కిరణ్ అబ్బవరం కెరీర్‌కి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు. దాంతో శ్రీమతి అడుగుపెట్టిన వేళా విశేషం వల్లే కిరణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడనే చర్చ మొదలైంది.
ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్య(Naga Chaintanya)కూడా తన వైవాహిక జీవితంలో కొత్త అడుగు వేస్తూ శోభిత ధూళిపాళ్లని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వివాహం తర్వాత నాగ చైతన్య తన కెరీర్‌పై మరింత పట్టుదలగా వర్క్ చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన రగ్గడ్ ఫిషర్‌మెన్ డ్రామా 'తండేల్' ఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్‌గా నిలవడమే కాకుండా, నాగ చైతన్య కెరీర్‌లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలిచింది. చైతు పెర్ఫార్మ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వెంటనే చైతన్య కెరీర్‌లో ఇంతటి అద్భుతమైన సక్సెస్ రావడం ఈ పెళ్లి సెంటిమెంట్‌కి మరింత బలాన్ని చేకూర్చింది.
ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని మరో సారి నిజం చేసే వంతు అఖిల్ కి వచ్చింది. మొన్న శుక్రవారం గ్రాండ్ గా రిలీజైన లెనిన్ అఖిల్ వరుస పరాజయాలకి ఫుల్ స్టాప్ పెట్టి సరికొత్త రికార్డుల దిశగా దూసుకుకెళ్తుంది. లెనిన్ కూడా అఖిల్ కి వివాహం జరిగిన తర్వాత వచ్చిన మూవీ కావడంతో శ్రీమతి ఇచ్చిన బహుమతి అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈ సెంటిమెంట్ కేవలం హీరోలకే కాదు, హీరోయిన్ల వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పులు కూడా కెరీర్‌కి సరికొత్త జోష్ నిస్తాయని సమంత నిరూపించింది. వివాహం తర్వాత తన సొంత బ్యానర్‌లోనే చేసిన యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ఏకంగా 100 కోట్ల భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో . 100 కోట్ల క్లబ్‌ను చేరి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన సమంత, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త లక్‌తో దూసుకుపోతున్నారు. ఈ విధంగా టాలీవుడ్‌లో పెళ్లి, వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగులు అనేవి నటీనటుల సినీ జీవితాలకు సరికొత్త అదృష్టాన్ని, బ్లాక్‌బస్టర్ విజయాలను తెచ్చిపెడుతున్నాయని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది.






