Home

»

Latest News

Tollywood: టాలీవుడ్ టుడే టాప్ ట్రెండింగ్స్

Apr 20, 2026

 

 

ఏ రోజుకా రోజు ఆసక్తికరమైన సరికొత్త సినీ న్యూస్ ని అందించడంలో చిత్ర పరిశ్రమ తగ్గేదేలే  అనే రీతిలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తుంది. మరి  టు డే టాప్ ట్రెండింగ్స్ న్యూస్ ఏంటో చూద్దాం.


1 . హైదరాబాద్ కి అల్లు అర్జున్ గుడ్ బై 

అల్లు అర్జున్ తన మకాన్ని హైదరాబాద్ నుండి ముంబైకి మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న 'రాకా' ముంబైలోనే అధిక భాగం షూటింగ్ ని జరుపుకుంటు వస్తుంది. లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ కూడా ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో పాటు నేషనల్ వైడ్ బ్రాండ్స్‌కి  అంబాసిడర్‌గాను ఉన్నాడు. వీటి షూటింగ్ కోసం తరచుగా ముంబై వెళ్లాల్సి రావడంతో పాటు అక్కడే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. అందుకనే కొన్ని సంవత్సరాలు ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకొని లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. పుష్ప ఇచ్చిన బూస్టప్ తో అతి పెద్ద పాన్ ఇండియా స్టార్స్ లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే.

2 . విజయ్ దేవరకొండకి నా తర్వాతనే  రష్మిక అంటున్న కావ్య 

బ్రహ్మముడి సీరియల్‌ ఫేమ్ కావ్య  రీసెంట్ గా వర్ష నిర్వహిస్తున్న 'కిస్సిక్ టాక్ షో' కి గెస్ట్‌గా వెళ్ళింది. విజయ్ దేవరకొండతో కిస్ సీన్ చేయాలంటే చేస్తావా అనే ప్రశ్న ఎదురవ్వగా  కావ్య మాట్లాడుతు రష్మిక గారేంటీ, నేనెంత బాగా చేస్తానో తెలుసా అని బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జున గారంటే  చాలా ఇష్టం. నా క్రష్ కూడా అని నాగార్జున గారిని చూసినప్పుడల్లా అనిపిస్తుందని కూడా కావ్య  చెప్పుకొచ్చింది.

3 . పెద్ది స్పెషల్ సాంగ్‌లో బాలయ్య హీరోయిన్
 సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ఒకటే చర్చ. పెద్ది స్పెషల్ సాంగ్ లో చరణ్ కి ఎవరు జత కడతారని. ఈ క్రమంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తూనే వస్తున్నాయి.    రీసెంట్ గా  సంయుక్త మీనన్  స్పెషల్ సాంగ్ లో చేయబోతోందనే న్యూస్ సినీ మార్కెట్ లో తాజా హోదాలో  హల్ చల్ చేస్తుంది. దీంతో ఈ  న్యూస్ నిజమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య తో అఖండ 2 లో సంయుక్త మీనన్ చేసిన విషయం తెలిసిందే.

4 .మగ్గుతున్న కొత్త సినిమాలు

గత శుక్రవారం విడుదలైన చిత్రాలకి  ఈ సోమవారం అత్యంత కీలకంగా మారింది. నాగశౌర్య నుంచి వచ్చిన బాడ్ బాయ్ ప్రేక్షకుల అంచనాలని  అందుకోవడంలో తడబడుతోంది. రొటీన్ కథనం కావడం మైనస్ అనే మాటలు వినపడుతున్నాయి. మరోవైపు కిరణ్ అబ్బవరం నిర్మాతగా వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ, మరో మూవీ పాపం ప్రతాప్ కి పర్వాలేదనే టాక్ వస్తున్నప్పటికీ  వసూళ్ల విషయంలో మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో టు డే కీలకం కానుంది.

5 . ఇండియన్ సినిమా కింగ్ ఎవరో తేలిపోనుందా?

 ఇండియన్ సినీ సర్కిల్స్ లో రీసెంట్ గా షారుఖ్ ఖాన్ vs ప్రభాస్ అనే టాగ్ జోరుగానే చక్కర్లు కొడుతుంది. డిసెంబర్ 24న షారుక్ వన్ మాన్ షో  కింగ్ రిలీజ్ కాబోతుంది. అదే సమయంలో ప్రభాస్ ఫౌజీతో బరిలోకి దిగుతున్నాడు. డిసెంబర్ 24 రిలీజ్ అని అధికారకంగా ప్రకటన రాకపోయినా, ఇంచుమించు అదే సమయంలోనే ఫౌజీ రాబోతుంది. గతంలో షారుక్, ప్రభాస్ లు డంకీ, సలార్ తో పోటీపడగా ప్రభాస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ నేసథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లో మరోసారి పోటీ పడనుండటంతో ఇండియన్ సినిమా కింగ్ గా మళ్ళీ ప్రభాస్ అనే నిలుస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 

6 . ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ 

ఈ రోజు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు. డెబ్భై ఐదు సంవత్సరాల వయసు నుంచి డెబ్భై ఆరవ పడిలోకి అడుగుపెడుతుండటంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా 
చంద్రబాబు నాయుడుకి బర్త్ డే విషెస్ చెప్పారు.  తన విషెస్ లో 'మావయ్య" అని 
సంబోధించడం నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుంది.

7 . రాకా కోసం ప్రెగెన్సీ ని లెక్క చెయ్యని దీపికా!
 
అగ్ర నటి దీపికా పదుకునే రెండో సారి ప్రెగెన్సీ అయిన విషయం తెలిసిందే. దీంతో  'రాకా' ఎలా కంప్లీట్ చేస్తుందనే ఆసక్తి అందరిలో మొదలయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో అయితే బెంగ కూడా పట్టుకొని మూవీ వాయిదా పడుతుందేమో అనే దిగులుతో ఉన్నారు. కానీ రీసెంట్ గా వినిపిస్తన్న కధనాలు ప్రకారం దీపికా రాకాని శరవేగంగా పూర్తి చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుందంట. మేకర్స్ కూడా దీపికాకి సంబంధించిన షెడ్యూల్ ని ముందుగా పూర్తి చేయబోతునట్టుగా సమాచారం

8 .మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి 

 ప్రజలకు ప్రేమని పంచడమే తన భాద్యతగా ముందుకు సాగుతున్న మెగాస్టార్.. మరోసారి తన మంచి మనసు చాటారు.  హార్ట్ ఆపరేషన్ కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ కి 10 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రికి వ్యక్తిగతంగా వెళ్లి శివ ఆరోగ్యం గురించి తెలుసుకుని, పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు. తన మాజీ మేనేజర్ కె.వి. నరసయ్య కుటుంబానికి కూడా అండగా నిలిచారు. నరసయ్య భార్యకు అవసరమైన బైపాస్ శస్త్రచికిత్స కోసం 9 లక్షల 50 వేల రూపాయలు అందించి, ఆ కుటుంబానికి అత్యవసర సమయంలో ఆపద్బాంధవుడయ్యాడు.


9 . విజయ్‌ విడాకుల కేసులో కోర్టు కీలక ఆదేశాలు

కోలీవుడ్ స్టార్, టీవీకే అధ్యక్షుడు విజయ్ విడాకుల పిటిషన్‌పై చెంగల్పట్టు కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను జూన్ 15కి వాయిదా వేసిన కోర్టు.. ఆరోజు విజయ్, సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతామన్న విజయ్ తరఫు న్యాయవాది విన్నపాన్ని కోర్టు తిరస్కరించినట్లు సమాచారం. మరోవైపు 250 కోట్ల సెటిల్‌మెంట్ కావాలని సంగీత కోరినట్లు, అయితే విజయ్ మాత్రం 35 కోట్లకు అంగీకరించినట్లుగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.

10 . ఆగని ధురంధర్ 2 ప్రభంజనం 

 నెల రోజులు దాటుతున్న ధురంధర్ 2 కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. నిన్నటితో వరల్డ్ వైడ్ గా 1783 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇండియాలో 1360 కోట్ల గ్రాస్ కాగా, ఓవర్ సీస్ లో 423 కోట్లతో 1783 కోట్ల గ్రాస్. మరి ఈ నేపథ్యంలో 2000 కోట్ల గ్రాస్ అందుకుంటుందేమో చూడాలి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com