
సినిమా ఇచ్చే కిక్కు ముందు ఏ కిక్కు పనికి రాదు. ఇప్పుడు ఆ కిక్కు థియేటర్ ని దాటి మీ ఇంట్లోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే. అదేనండి ఓటిటి. ఇప్పుడు సినిమా ఓటి టి ప్రియులకి ఈ వారం సరికొత్త వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. అలరించడం అంటే మాములుగా అలరించడం కాదు. ఈ రోజు 22 నుండి 28 వరకు ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఏకంగా 21 కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సరికొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. పైగా యాక్షన్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్లతో పాటు వరల్డ్ క్లాస్ ఫాంటసీ డ్రామాలు. మరి ఈ పండుగకి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం.
అర్జున్ బ్లాస్ట్ జోన్ - యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, కన్నప్ప ఫేం ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'బ్లాస్ట్ జోన్'. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న మూవీ జూన్ 25 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
బాహుబలి ద టార్చ్ బేరర్ - బాహుబలి ఫ్రాంచైజీ బిహైండ్ ద స్టోరీని డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. జూన్ 26 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 'బాహుబలి ది టార్చ్ బేరర్' మూవీ అందుబాటులోకి రానుంది. మూవీకి సంబంధించి తెర వెనుక కథలతో పాటు ఏళ్ల పాటు బాహుబలి ప్రయాణం, యుద్ధ సన్నివేశాలు ఎలా తీశారో? ఈ సిరీస్‌లో చూపించనున్నారు.
లింగం - కదిర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ స్పోర్ట్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 26 నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో - హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్ - జూన్ 22), గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్ - జూన్ 23), అలియన్స్ (హిందీ సిరీస్ - జూన్ 26), మరీచిక, దృశ్యం 3, యువర్ ఫాల్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా).
Also read: Sreeleela: శ్రీలీలకి ఘోర అవమానం.. ముఖ్యమంత్రి భార్య అలా ప్రవర్తించడం తప్పే!
నెట్ ఫ్లిక్స్ - ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే (ఇంగ్లిష్ మూవీ - జూన్ 24), అనదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 24), బ్లాస్ట్ జోన్ (తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 25), క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లిష్ మూవీ - జూన్ 26), లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా - జూన్ 26), బాహుబలి ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ సిరీస్ - జూన్ 26), లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్ - జూన్ 27).
జియో హాట్ స్టార్ - ద ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22), అవతార్ 3 (తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 24), లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్ - జూన్ 26), కెనతా కానోమ్, సేవ్ ది టైగర్స్, అతిరథి (తెలుగు డబ్బింగ్ మూవీ).
ZEE5 - ప్రేమలా కండిషన్స్ అప్లై (జూన్ 26), మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్ - జూన్ 26), ముతస్సీ (మలయాళ సిరీస్ - జూన్ 26). లయన్స్ గేట్ ప్లే - బ్లూ బాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ - జూన్ 26), ద యెతి (జూన్ 26), దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లిష్ సిరీస్ - జూన్ 26).
ఆహా - రేజర్, థాంక్యూ సుబ్బారావు, ధైర్యే సాహసే అమృత
సోనీ లివ్ - పెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్ - జూన్ 26), మనోరమ మ్యాక్స్ - కప్ (మలయాళ సినిమా - జూన్ 25).






