ఇది నా స్టామినా.. రికార్డు కలెక్షన్స్ వసూలు
on Jan 12, 2026

-రాజాసాబ్ కలెక్షన్స్ నిజమేనా
-పీపుల్ మీడియా ఫాక్టర్ ఏం చెప్తుంది
-ప్రభాస్ స్టామినా మరో సాటి తెలిసిందా!
-మన శంకర వరప్రసాద్ ప్రసాద్ గారు ప్రభావం ఎంత!
రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)'ది రాజాసాబ్'(The Raja saab)తో వరల్డ్ వైడ్ గా తొమ్మిదవ తారీఖున అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలవ్వగా ఆ అంచనాలని అందుకోవడంలో రాజా సాబ్ విఫలమయ్యాడనే అభిప్రాయాన్ని ప్రీమియర్స్ నుంచే మెజారిటీ అభిమానులు, ప్రేక్షకులు వ్యక్తం చేసారు. దీంతో సుమారు 300 కోట్ల రూపాయలకి పైన బడ్జెట్ తో తెరకెక్కిన రాజాసాబ్ ఏ మేర కలెక్షన్స్ సాధిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల వరకు రాజాసాబ్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలు చూద్దాం.
రాజాసాబ్ మూడు రోజులకి వరల్డ్ వైడ్ గా 183 కోట్లరూపాయిల గ్రాస్ ని రాబట్టాడు. ఈ మేరకు రాజాసాబ్ ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారంగా వెల్లడి చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. సదరు పోస్టర్ లో A festival treat turned BOX OFFICE CARNAGE”అనే వర్డ్ ని కూడా ఉంచడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సదరు కలెక్షన్స్ పై సినీ విశ్లేషకులు స్పందిస్తు మూడు రోజుల్లోనే 183 కోట్ల దాకా రాబట్టిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ మూడ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ రోజుతో 200 కోట్ల మార్కుని చాలా ఈజీగా దాటినట్లే అని అంటున్నారు. టాక్ దృష్ట్యా కలెక్షన్స్ ల విషయంలో ఏమైనా తేడా వస్తుందేమో అని అందరు అనుకున్నారు. కానీ భారీ కలెక్షన్స్ సాధించడంతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ సత్తా చాటినట్లయిందనే మాటలు కూడా సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
Also Read: తీసుకున్న రెమ్యునరేషన్స్ ఇవేనా!. ప్రస్తుత టాక్ ఎలా ఉంది
ఇక ఈ రోజు విడుదలైన మెగాస్టార్, విక్టరీ ల మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ కలెక్షన్స్ పై మన శంకర వరప్రసాద్ గారు ప్రభావం చుపిస్తాడేమో అనే మాటలు కూడా సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



