
నెగిటివ్ టాక్ వస్తే రానివ్వండి బాక్స్ ఆఫీస్ పై మాత్రం నా జోరు కొనసాగుతూనే ఉంటుందనట్టుగా నాని తన ప్యారడైజ్ తో నిరూపిస్తూ ఉన్నాడు. ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 88 కోట్ల రూపాయలు సాధించిన ప్యారడైజ్ రెండో రోజు కూడా 'యేష నాగుల' అంటూ చిందులేస్తూ మరి రికార్డు కలెక్షన్స్ రాబట్టాడు.
ఇది కూడా చదవండి: టెన్షన్‌లో త్రివిక్రమ్: వెంకటేష్ కొడుకు కిడ్నాప్ డ్రామా
ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు 26 కోట్ల గ్రాస్ ని సాధించినట్టుగా తెలుస్తుంది. దీంతో రెండు రోజులకే 114 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు.. ప్రాంతాల వారీగా చూస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో నాని మానియా స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే 50 %పైనే కలెక్షన్స్ డ్రాప్ కావడం మైనస్. మరి వీకెండ్ ని ఎలా ఉపగోగించుకుంటుందో చూడాలి.

[The Paradise Second Day collections, The Paradise Collections, Nani, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News, kayadu Lohar]






