Home

»

Latest News

The paradise: ఆగస్టు, డిసెంబర్ కాదు.. ప్యారడైజ్ రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

Jun 23, 2026 2:37PM

 

నాచురల్ స్టార్ నాని(Nani)రేంజ్ ని మరో లెవల్ కి తీసుకువెళ్లే మూవీ ది ప్యారడైజ్(The Paradise)అనే నమ్మకం అభిమానుల్లో చాలా బలంగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు వాళ్ళ నమ్మకానికి  తగ్గట్టుగానే ఉన్నాయి. ఇప్పటికే  దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ క్రేజీ కాంబోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి 

 మొదట 'ది ప్యారడైజ్' చిత్రాన్ని  మార్చి నెలలో రిలీజ్ చెయ్యడానికి  ప్లాన్ చేశారు. అయితే... ఆ తర్వాత ఆగస్టుకు వాయిదా పడింది. ఆగస్టులో విడుదల గురించి కూడా ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో డిసెంబర్ కి వెళ్ళిపోతుందని ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం. సెప్టెంబర్ 25, 2026న 'ది పారడైజ్' థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందట. త్వరలో మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందనేది సినీ సర్కిల్స్ తాజా టాక్.


Also read: srinivasa mangapuram: అన్న కొడుకు కోసం మహేష్ కీలక నిర్ణయం.. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నాడా! 


నాని సరసన హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్రిట్టీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. నాని ‘ధగడ్’ అనే పవర్‌ఫుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ వంటి 6 ప్రధాన భారతీయ భాషలతో పాటు అంతర్జాతీయంగా ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com