
నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల తెలుగు నాట తమ మానస పుత్రిక 'ది ప్యారడైజ్' తో పరాజయాపు కౌగిలిలో మునిగిపోయారు. ఇప్పటివరకు ప్రదర్శించిన అన్ని షోస్ ప్రేక్షకులు ఒకటే మాట. ప్యారడైజ్ గట్టెక్కడం కష్టమే అని.
అయితే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి ప్రధాన ఓవర్సీస్ మార్కెట్లలో ప్రీమియర్ షోలు పూర్తి కావడంతో, అక్కడ చూసిన ప్రేక్షకులు, క్రిటిక్స్ నుండి టాక్ ఏంటనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. విదేశీ ప్రీమియర్ల నుంచి వస్తున్న వివరాలు మరియు సెన్సార్ సమాచారం ప్రకారం, అధిక మోతాదులో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను మరియు నాని డార్క్ యాక్షన్ లుక్‌ను ఇష్టపడే వారిని థ్రిల్ చేసినప్పటికీ, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సుదీర్ఘంగా సాగడం మరియు ఎమోషనల్ కనెక్ట్ కొంత తగ్గిందనే టాక్ ఓవర్సీస్ రివ్యూలలో వినిపిస్తోంది. మరి ఓవర్ సీస్ లో కింగ్ అయిన నాని పూర్తి రన్నింగ్ లో ఎంత మేర సాధిస్తాడో చూడాలి.
ఇది కూడా చదవండి: 400 కోట్ల క్లబ్ వైపు 'హనుమాన్ అంశ్' సంచలన పయనం
.webp)
వ్యాపార పరంగా చూస్తే, నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బ్యాలెన్స్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లక్ష్యంగా బరిలోకి దిగింది. బుక్ మై షోలో విడుదలకు ముందే ప్రతి గంటకూ వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడై అరుదైన రికార్డును నమోదు చేసింది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి 'ది ప్యారడైజ్' చిత్రం నాని కెరీర్‌లో ఒక విభిన్నమైన సాహసోపేత ప్రయత్నమని, మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్ ఇస్తూ, నానిని టాలీవుడ్ టైర్-1 హీరోల సరసన చేర్చే దిశగా బలమైన అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
[The Paradise Movie Overseas Talk Analysis, The Paradise, Nani, Kayadu Lohar, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne]




.webp)
