
సెంటిమెంట్, ప్రభంజనం, ఊపు, ఉత్సాహం పర్సన్స్ కే కాదు తెలుగు సినిమాకి కూడా ఉంటుంది. ఒక సూపర్ డూపర్ హిట్ రాగానే ఆ వెంటనే వచ్చే మరో సినిమాకి ప్రేక్షకుల సంఖ్య ఘననీయంగా పెరుగుతుంది. మరి అంచనాలు ఉన్న సినిమా అయితే కలెక్షన్స్ లెక్కట్టుకోవడానికి టైం కూడా దొరకదు.
ది ప్యారడైజ్.. నాచురల్ స్టార్ నాని సగర్వంగా సెల్యులాయిడ్ పై ల్యాండ్ అవుతున్న మూవీ. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, సినిమా కాన్సెప్ట్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచాయి. మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సాధించిన సంచలన విజయం తెలిసిందే. ఈ విజయం వెనక మాములు టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు రావడం కూడా ఒక కారణం. ఎందుకంటే సినిమా బాగుందని టాక్ రావడం, రేట్స్ కూడా రీజనబుల్ గా ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం ఎక్కడ నా ఇరుముడి అంటూ థియేటర్స్ బాట పెట్టి షో పొరపాటున లేట్ అయినా వార్నింగ్ లు ఇచ్చే పరిస్థితి. దీంతో ‘ది ప్యారడైజ్’ కూడా సాధారణ టికెట్ ధరలతో విడుదలైతే పెద్ద ప్లస్ పాయింట్ గా మారుతుందనే అభిప్రాయంతో ప్యారడైజ్ మేకర్స్ ఉన్నట్టుగా సినీ సర్కిల్స్ లో టాక్ వినపడుతుంది .ముఖ్యంగా నాని సినిమాలకి ఫ్యామిలీ ఆడియెన్స్ ఏ స్థాయిలో వస్తారో తెలిసిందే

Also read: పెళ్లిపై టాప్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు: ఆనందంగా ఉండాలంటే అది చాలు
ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే టికెట్ ధరలు అందుబాటులో ఉంటే పండుముసలి కూడా థియేటర్స్ లో సినిమా చూడటం తథ్యం. ఎందుకంటే ఈ విశ్వంలో ఎంటర్ టైన్ మెంట్ తో మంచిని చెప్పే ఒకే ఒక్క సాధనం సినిమా. ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఈ నెల 24 .
[The Paradise, irmudi, Nani, Raviteja, Ticket Prices, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News, Srikanth Odela]




