Home

»

Latest News

తరుణ్ భాస్కర్‌కు ఈషానే సోల్‌మేట్.. కొడుకు జీవితంలో ఆమె స్థానం ఏంటో చెప్పిన తల్లి.!

Nov 18, 2026 1:26PM

సినిమా ఈవెంట్లలో అప్పుడప్పుడు జరిగే కొన్ని విషయాలు సినిమాల కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ అలాంటి ఆసక్తికరమైన ఘటనే జరిగింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ వ్యక్తిగత జీవితం గురించి ఆయన తల్లి, నటి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా నటి ఈషా రెబ్బా గురించి ఆమె మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

గత రెండేళ్లుగా తరుణ్ భాస్కర్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడని గీతా భాస్కర్ వెల్లడించారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టుకోవడం వంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడ్డాడని చెప్పారు. కొన్ని రోజులు అసలు ఇంటికే వచ్చేవాడు కాదని, వచ్చినా అర్ధరాత్రి 2 గంటలకు, 4 గంటలకు వచ్చేవాడని గుర్తుచేసుకున్నారు. అలాంటి సమయంలో అతనికి అండగా నిలిచిన వ్యక్తి ఈషా రెబ్బా అని ఆమె తెలిపారు.

“నాకు వయసు అయిపోతోంది.. తరుణ్ పక్కన ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుందని భయపడేదాన్ని. కానీ ఈషా రూపంలో అతనికి మంచి తోడు దొరికింది. ఆమె తరుణ్‌కు మంచి ఫ్రెండ్, సపోర్ట్ మాత్రమే కాదు.. ఒక కుటుంబ సభ్యురాలిలా ఉంది. ఫ్రెండ్స్‌తో కూడా అన్ని విషయాలు చెప్పుకోలేం. జీవితంలో ఒక పార్ట్‌నర్, ఒక సోల్‌మేట్ ఉండాలి” అంటూ గీతా భాస్కర్ భావోద్వేగంగా మాట్లాడారు.

అంతేకాదు, ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమాను పూర్తి చేయడంలోనూ ఈషా రెబ్బా తరుణ్‌కు ఎంతో సహకరించిందని ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈషా ఈ కార్యక్రమానికి రాలేకపోయినా, ఆమెకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోలేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ENE Repeat ఫస్ట్ రివ్యూ ఇదే!

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమ, పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తరుణ్ తల్లి స్వయంగా ఈషాను తన కొడుకుకు సోల్‌మేట్‌గా అభివర్ణించడం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.

ఇక ‘ఈ నగరానికి ఏమైంది 2’ విషయానికి వస్తే.. 2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఇది సీక్వెల్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చవచ్చు:
మళ్ళీ విలన్‌గా గోపీచంద్.. జయం, వర్షం రోజులు గుర్తొస్తాయా.?
నీ గూడు చెదిరింది.. ప్రతి పదంలోనూ ఒక విషాదం.. పాటలోని అసలు భావం ఇదే.!

 

 

 

[ENE Repeat, Tharun Bhascker, Eesha Rebba, Geetha Bhascker]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com