
వెంకీ మామ, కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, త్రివిక్రమ్, థమన్ తమ ఆదర్శ కుటుంబాన్ని చూపించడానికి అక్టోబర్ 30 న వస్తున్నారు. ఈ మేరకు శాంపిల్ పీస్ ట్రైలర్ ని అందించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్ లో థమన్ మాట్లాడిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తమన్ మాట్లాడుతు 'అభిమానులు ఎప్పుడు 'ఓజీ' గురించి ప్రస్తావించినా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే గుర్తుకొస్తారని, అసలు ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి, సాధ్యపడటానికి పూర్తిగా త్రివిక్రమ్ గారే కారణమని తమన్ స్పష్టం చేశారు. ఈ ఆసక్తికరమైన ప్రకటనతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: టైగర్ ష్రాఫ్ కారు కాల్పులపై ఆర్జీవీ సంచలన ట్వీట్: వర్మ చెప్పేది నిజమేనా!

ఇదే వేదికపై వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై తనకున్న అమితమైన ప్రేమను తమన్ మనసారా పంచుకున్నారు. తనకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్‌లో వెంటనే చూసే సినిమా 'నువ్వు నాకు నచ్చావ్' అని, ఇప్పటికీ రోజూ భోజనం చేసే సమయంలో ఆ సినిమా చూస్తూనే ఉంటానని సరదాగా చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అరవింద సమేత' సినిమాకు పనిచేసే అవకాశం తనకెలా దక్కిందో గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు విక్టరీ వెంకీ మామ మరియు త్రివిక్రమ్ గారి కాంబోలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రానికి మ్యూజిక్ అందించడం తన జీవితంలో మరపురాని గొప్ప అనుభూతినిచ్చిందని వెల్లడించారు. ఈ చిత్రంలో వెంకీ మామ మరియు త్రివిక్రమ్ గారి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద ప్రేక్షకులని కట్టిపడేస్తాయని తమన్ తెలిపారు.
[Thaman Speech In Aadarsha Kutumbam Trailer Event, thaman reveals pawan kalyan og secret Reveals, Aadarsha Kutumbam, Thaman S, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]




