Home

»

Latest News

Karuppu: కరుప్పు ఆ స్టార్ హీరోదా!.. వైరల్ అవుతున్న న్యూస్ 

May 27, 2026 10:58AM

 

'కరుప్పు'(Karuppu)కొనసాగిస్తున్న వీరవిహారం కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. పరాజయాలని ఆప్త మిత్రులుగా చేసుకొని తిరుగుతున్న సూర్య(Surya)కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇస్తూ రెండు వారాలు ఇంకా పూర్తి చేసుకోకుండానే 250 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతుంది. అయితే  ఒక బిగ్ హీరో కరుప్పు లో మొదట నటించాలని అనుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది

డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ కరుప్పుని  మొదట తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్(Vijay)కోసం రాసుకున్నాడని, 2023 ఆగస్టులో బాలాజీ, విజయ్‌ని కలిసి కథ వినిపించడంతో పాటు కథ వినగానే విజయ్ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారట. మనమే ఈ సినిమ చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. దీంతో విజయ్ లాంటి స్టార్ హీరో తన కథకి  ఓకే చెప్పడంతో బాలాజీ తెగ సంబరపడిపోయాడట. అయితే అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది. బాలాజీ ఫుల్ స్క్రిప్ట్ కోసం చాలా టైమ్  తీసుకోవడంతో  విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేసాడు. దీంతో బాలాజీ విజయ్ కోసం రాసుకున్న కథతో సూర్యని  సంప్రదించారట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ హోదాలో తన సత్తా చాటుతుంది.

Also read: నందమూరి vs అక్కినేని.. 11 ఏళ్ళ తర్వాత బరిలోకి!

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com