Home

»

Latest News

Telugu cinema: అచ్చ తెలుగు సినిమా అంటే ఏంటి!.. ఆది రావాలంటే ఏం చెయ్యాలి

Jun 23, 2026 6:16PM

 

సినిమా.. మన కలలో, ఊహల్లో వచ్చే ఎన్నో అద్భుతాల్ని సెల్యులాయిడ్ పై వచ్చేలా చేసే కల్మషం లేని దివ్యమైన ఔషధం.. అసలు నిజమైన సినిమా చూస్తుంటే, అంటే అద్భుతమైన కథ, ఆసక్తిని రేకెత్తించే కథనం, హీరో, హీరోయిన్, విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్, కామెడీ ఆర్టిస్ట్ లకి సమానమైన ప్రాతినిధ్యం, ఉల్లాసపరుస్తూనే  ఆలోచింప చేసే మాటలు, ఉన్న పళంగా డాన్స్ చేసేలా చేసే పాటలు, ఇలా అన్ని సమపాళ్లలో ఉండేది సినిమా. అలాంటి సినిమాని స్క్రీన్ పై చూస్తున్నప్పడు ఎవరికి ఇష్టదైవమైనా వచ్చి పిలిచినా వెళ్ళరు. అంత శక్తివంతమైనది సరైన సినిమా.

కానీ చాలా సంవత్సరాల నుంచి సినిమాల్లో పైన చెప్పుకున్న ఛాయలు నిల్.. కేవలం హీరో పైనే కథ, కధనం మొత్తం వెళ్తుంది. దీంతో గుడ్డిలో మెల్ల లాగా అమావాస్య పౌర్ణమికి అన్నట్టుగా ఏదో ఒక మూవీ ఆడుతుంది. ఆడినా కూడా సంతృప్తి కరమైన సినీ సువాసన భోజనం అయితే మాత్రం కాదు. ఈ విషయంపై సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అచ్చ తెలుగు సినిమా రాకపోవడానికి కారణం హీరోపైనే కథ నడవడం. అలా హీరోపైన కథ నడవాలనే ఆలోచన హీరో నుంచి వస్తుందా? లేక మేకర్స్ నుంచి వస్తుందా  అని అర్ధం కావడం లేదు. రైటర్స్ ఈ విషయంలో ఆలోచించి తెలుగు సినిమా కథకి మూల  స్థంభాలైన అన్ని అంశాలని పొందుపరచాలని కోరుకుంటున్నారు.

Also read: Mohan babu: సింహం ఆకలితో ఉందని అర్ధమవుతుంది..అభిమానుల రియాక్షన్ ఏంటి!

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com