Home

»

Latest News

Teja sajja: తేజ సజ్జ ప్లానింగ్ వైరల్.. పెద్ద హీరోలు కూడా ఆ సూత్రం ఫాలో అయితే! 

May 18, 2026


బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ పొందిన హీరో తేజ సజ్జ(Teja Sajja). తనకంటూ ఫ్యాన్స్ బేస్, ప్రేక్షకులని సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో తన కట్ అవుట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. 

 తేజ సజ్జ నుంచి వచ్చిన గత చిత్రం 'మిరాయ్'(Mirai)సాధించిన విజయం తెలిసిందే. సెల్యులాయిడ్ పై ఒక సరికొత్త వరల్డ్ ప్రత్యక్షమయింది. దీంతో మిరాయ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'మిరాయ్ 2'(Mirai 2)పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యింది. అయితే ఇది రెగ్యులర్ షూట్ కాదు  . ఈ షూట్ లో అత్యంత కీలకమైన, క్లిష్టమైన వీఎఫ్ఎక్స్ బ్లాక్స్ (VFX Blocks) కోసం అవసరమైన బ్యాక్‌గ్రౌండ్ ప్లేట్స్, లొకేషన్ స్కాన్లు,  కొన్ని విజువల్ ఎలిమెంట్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. విశాఖపట్నం తీర ప్రాంతంలో దాదాపు పది రోజుల పాటు సాగనున్న ఈ వినూత్న షూటింగ్ వెనుక ఒక భారీ మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ఈ వీఎఫ్ఎక్స్ ప్లానింగ్ ముందుగానే పూర్తి చేయడం వల్ల, గ్రాఫిక్స్ స్టూడియోల వారికి విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం దొరుకుతుంది. ఆ తర్వాత తేజ సజ్జా నేరుగా ప్రధాన షూటింగ్‌లో పాల్గొని, తన టాస్క్‌ని  చాలా వేగంగా పూర్తి చేయవచ్చు. దీనివల్ల షూటింగ్ ముగిసిన వెంటనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది కానీ, గ్రాఫిక్స్ ఆలస్యం వల్ల సినిమా వాయిదా పడే అవకాశమే ఉండదు. 


Also read: Peddi: బాక్సాఫీస్ వద్ద పెద్ది సునామీ.. రిలీజ్ కి ముందే నిర్మాత జేబులోకి ఎన్ని కోట్లో తెలుసా!

ఇప్పుడు దాదాపుగా అగ్ర హీరోల సినిమాలన్నీ విఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉంటున్నాయి కాబట్టి తేజ సజ్జ బాటలో బడా హీరోలు కూడా పయనిస్తారేమో చూడాలి.పార్ట్ 1 ని తెరకెక్కించిన  కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni)సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తుండగా  మరో సారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై  టి.జి.విశ్వప్రసాద్(TG Vishwaprasad)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.తేజ సజ్జ ఖాతాలో 'జాంబీ రెడ్డి 2' ఉన్న విషయం కూడా తెలిసిందే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com