Home

»

Latest News

VIjay: ఓటిటిలోకి విజయ్ పొలిటికల్ సెటైర్ మూవీ వచ్చేసింది భయ్యా.. ఫ్యాన్స్ షాక్ 

Apr 30, 2026 11:01AM

 

 

 

అందరు అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. ఈ వాస్తవం సృష్టి ఆరంభం నుంచే ఉంది. ఆ విషయంలో ఇళయ దళపతి విజయ్(VIjay)కి మినహాయింపు ఏమి ఉండదు. తన పొలిటికల్ పార్టీ  'టివికే' తో అధికారం కోసం విజయ్ ప్రచారాన్ని చేస్తున్న సమయంలో ఏకంగా విజయ్ ని టార్గెట్ చేస్తూ ఒక సినిమాని నిర్మించారు. ఆ సినిమానే 'TN 2026’. థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ మీ ఇంట్లోకి రావడానికి సిద్దమయ్యింది. ఆతిధ్యం ఇస్తారో లేక పట్టించుకోరో మీ ఇష్టం. ఆ డీటెయిల్స్ చూద్దాం.  

TN 2026 ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా లాంటి పాపులర్ ఓటిటి లలో అందుబాటులో ఉంది.  ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే తమిళనాట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం, ఆయన పార్టీ (TVK) లక్ష్యంగా ఈ సినిమా రూపొందిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టైటిల్ ‘TN 2026’ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం కావడం, హీరో గడ్డం లుక్ విజయ్‌ని పోలి ఉండటంతో ఆయన అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అసలు విడుదలకి  ముందే టీజర్‌తో వివాదాలను, ఆసక్తిని సమపాళ్లల్లో ఉంచింది.     

అయితే, చిత్ర యూనిట్ మాత్రం ఇది ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించినది కాదని, రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతి నటుడి ప్రయాణాన్ని సెటైరికల్‌గా చూపిస్తుందని స్పష్టం చేసింది. విజయ్ ని పోలి ఉండే క్యారక్టర్ లో నటరాజ్ సుబ్రహ్మణ్యం కనిపించగా తంబి రామయ్య, ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు వంటి సీనియర్ నటులు కీలక మైన క్యారెక్టర్స్ ని పోషించారు. తంబి రామయ్యనే కథని అందించగా ఆయన కుమారుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాకుండా, నేటి రాజకీయ పరిస్థితులపై పదునైన విమర్శలు చేసింది. డార్బుక శివ అందించిన సంగీతం, నట్టి నటన సినిమాకు బలంగా నిలిచాయి. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి, సెటైరికల్ సినిమాలను ఇష్టపడేవారికి  ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also read: Pawan kalyan: రంగంలోకి దిగిన ప్రకాష్ రాజ్.. పవన్ పై ఘాటైన విమర్శలు 

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో, ‘TN 2026’ ఓటీటీ రిలీజ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ఉత్తరాది యువకుడు చెన్నైకి వచ్చి, స్టార్ హీరోగా ఎదిగి, చివరకు రాజకీయ నాయకుడిగా మారే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, వ్యవస్థలోని లోపాలను హాస్యంతో కలిపి ఈ సినిమాలో చూపించారు.

 


 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com