
తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ అనే టాగ్ లైన్ ని, హోదాని అనుభవించిన తమన్నా భాటియా, నిన్న సిద్దార్ధ మల్హోత్రాతో కలిసి మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది వాన్' మూవీతో బాలీవుడ్ థియేటర్లలో అడుగుపెట్టింది. 'పంచాయత్' వంటి హిట్ సిరీస్ డైరెక్టర్ దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించడం, సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా త్రిపాఠి, అనూప్ సోని వంటి భారీ తారాగణం ఉండటంతో మంచి హైప్ ఏర్పడింది.
Advance booking లోనూ రూ. 6.04 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి, 2.73 లక్షల టికెట్లు అమ్ముడవడంతో మొదటి రోజు రూ. 7 నుండి 8 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే క్రిటిక్స్ నుంచి వచ్చిన నెగెటివ్ రివ్యూలు, డివైడ్ టాక్ ఇప్పుడు అభిమానులని నిరాశకి గురిచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: హీరోయిన్‌ని బీట్ చేసేలా ఉందిగా: ప్యారడైజ్‌లో నాని యంగ్ మదర్‌గా కనిపించిన బ్యూటీ ఎవరంటే!

తమన్నా ‘మమత’ అనే ఎమోషనల్ రోల్ లో కనిపించింది. పిల్లలు లేని బాధతో, ఆచారాలు, నమ్మకాల మధ్య తపించే ఓ సగటు భార్యగా తన నటనతో మంచి మార్కులే సాధించింది. అలాగే ముంబై ఇంజనీర్‌గా నటించిన సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ పై బాగానే కుదిరింది. అయితే కథనంలో స్పష్టత లేకపోవడం, ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ కథనం దారి తప్పడం, క్లైమాక్స్ తేలిపోవడంతో విమర్శకులు ఈ చిత్రానికి కేవలం 0.5/5 నుండి 2/5 వరకు మాత్రమే రేటింగ్స్ ఇచ్చారు. ఫోల్క్‌లోర్, వనదేవి పవిత్ర అడవి, ఛఠ్ పూజ ఎమోషన్స్, మరియు ఫాంటసీ అంశాలను ఒకేచోట కలపాలని చూసిన దర్శకుడి ప్రయత్నం పూర్తిగా మెప్పించలేకపోయిందని మెజారిటీ నెటిజన్ల మాట. దీంతో హిందీ బెల్ట్‌లో సొంతంగా ఓ పెద్ద సోలో హిట్ కొట్టాలని కలలు కంటున్న తమన్నాకి 'ది వాన్' ఫలితం చేదు ఫలితాన్ని ఇచ్చినట్టే.
[Tamannaah The Vvaan Movie Review Telugu, Tamannaah, Sidharth Malhotra, Tamannaah Setback Bollywood, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





