Home

»

Latest News

Nagarjuna: 20 ఏళ్ళ తర్వాత నాగ్ సరసన కన్ఫార్మ్ 

Apr 28, 2026


సిల్వర్ స్క్రీన్ పై యువసామ్రాట్ హోదాలో కింగ్ నాగార్జున(Nagarjuna),లేటెస్ట్ క్రేజీ తార హోదాలో టబు(Tabu)'నిన్నేపెళ్లాడుతా' మూవీలో డాన్స్ చేస్తుంటే అభిమానులు,ప్రేక్షకులే కాదు ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్న స్టాఫ్ సైతం చిందులేసే వాళ్ళు . పైగా స్క్రీన్ మొత్తం తమ సొంత ఖర్చుతో లైటింగ్ చేయించిన వాళ్ళు సైతం ఉన్నారు. దీన్ని బట్టి ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఉన్న కెపాసిటీని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సెల్యులాయిడ్ వద్ద ఆ సందడి భాగ్యం దొరకనుంది.

నాగార్జున 100వ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో టబు చేయడం కన్ఫార్మ్ అయ్యింది. ఈ విషయానికి ద్రువీకరిస్తు టబు తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక సోఫాలో 100 చిత్రానికి సంబంధించిన క్లాప్ బోర్డు ఉంచింది. ఇప్పుడు ఈ న్యూస్ తో ఇరువురి కాంబో అభిమానుల్లో జోష్ వచ్చింది. పైగా నాగ్ ఇరవై ఐదేళ్ల యువకుడిగా కూడా కనిపించబోతున్నాడనే టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలో టబు రోల్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు.  నాగ్,టబు నిన్నేపెళ్లాడుతాతో పాటు 'ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ లో ఒక సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే.  


Also read: Divya Sathyaraj: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కట్టప్ప కూతురు.. సపోర్ట్ చేయండి


తమిళ దర్శకుడు రా కార్తీక్(Ra karthik)దర్శకత్వలో తెరకెక్కుతుండగా కింగ్ 100 , లాటరీ కింగ్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా నాగ్ తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ దగ్గరలోని కులుమనాలిలో షూటింగ్ ని జరుపుకుంటుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com