
చియాన్ విక్రమ్ కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ గురించి ఇప్పడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అభిమానులు, ప్రేక్షకుల కోసం ఒళ్ళు ఊనం చేసుకొని మరి తన క్యారక్టర్ లో జీవిస్తాడు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి వరుస పరాజయాలని ఎదుర్కొంటున్నాడు.
ప్రస్తుతం సూర్య కరుప్పు అలియాస్ వీరభద్రుడుతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తున్నాడు. దీంతో ఇప్పుడు కోలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల కళ్ళు 'చియాన్' విక్రమ్ అప్‌కమింగ్ భారీ కంబ్యాక్ ప్రాజెక్ట్‌పై పడ్డాయి. విక్రమ్ నుండి ఒక పక్కా కమర్షియల్ బ్లాక్‌బస్టర్ వచ్చి చాలా కాలం అవుతుండటంతో, సూర్య తరహాలోనే విక్రమ్ కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టి తన సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్జే బాలాజీ ప్లానింగ్, సాయి అభ్యంకర్ మ్యూజిక్ థియేటర్లలో పూనకాలు తెప్పించడంతో 'కరుప్పు' ఎలాగైతే నిలదొక్కుకుందో, విక్రమ్ రాబోయే మాస్ ఎంటర్‌టైనర్ కూడా అదే స్థాయిలో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also read: Karuppu: వీరభద్రుడు ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్.. ప్రముఖ దర్శకుడి వీడియో వైరల్
విక్రమ్ ఇటీవలే రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసాడు. రెండు పారలల్ గా షూట్ జరుపుకుంటాయనేది టాక్ .






