
కొంత మంది నటీనటులపై కాలానికి ఏమైనా కన్ను గొడుతుందో, లేక వాళ్ళ స్వయంకృతాపరాధమో తెలియదు కానీ ఒక వెలుగు వెలిగిన జీవితాలు హఠాత్తుగా చీకటి కోణంలోకి నెట్టబడతాయి. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తన సహజసిద్ధమైన నటనతో, హాస్య చతురతతో, అద్భుతమైన హావభావాలతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటి సురభి బాలసరస్వతి. తెరపై ఎప్పుడూ నవ్వులు పూయించే ఈ మహానటి జీవితం వెనుక ఒక గుండెలను పిండేసే విషాద కోణం ఉందంటే నమ్మడం కష్టం.
నాటక రంగానికి పెట్టింది పేరైన సురభి కుటుంబం నుంచి వచ్చిన ఆమె, చిన్నతనంలోనే నటనపై మక్కువ పెంచుకుని నాటకాల ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1950ల కాలంలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, అప్పటి అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేషన్ వంటి దిగ్గజ సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్యతో సురభి బాలసరస్వతి కాంబినేషన్ అప్పట్లో ఒక పెద్ద సంచలనం. వీరిద్దరూ కలిసి నటించిన హాస్య సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వించేవి. "శాంతి నివాసం", "కన్యాశుల్కం", "ఇల్లరికం" వంటి 100కు పైగా అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులకు చిరస్మరణీయమే. 1950 నుండి 1970 మధ్యకాలంలో విడుదలైన పదుల కొద్దీ సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో నటించి టాలీవుడ్ తెరపై చెరగని ముద్ర వేశారు.
ఇది కూడా చదవండి: తెలుగు సినిమాని చంపేస్తోంది ఏంటి: వాళ్ళు రాకపోవడం కూడా ఒక కారణమా!
అయితే వెండితెరపై నిరంతరం డిమాండ్ ఉన్న నటిగా, వెలుగులు విరజిమ్మిన కథానాయికగా కోట్లాదిమంది గుండెల్లో నిలిచిన ఈ నటి వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర నైరాశ్యంలో సాగింది. నటన ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, ఆమె చివరి రోజుల్లో అనుభవించిన మానసిక వేదన అపారం. బాలసరస్వతిది ముక్కుసూటి మనస్తత్వం. శకునాలు, జాతకాలని నమ్మేవారు కాదు. జీవితంలో ఒంటరి పోరాటం చేశారు.

పరిశ్రమలో తోడు అవసరమని భావించి, దర్శకుడు తాపీ చాణక్యతో కొంతకాలం సహజీవనం చేశారు. ఆయనకు అప్పటికే వివాహమైంది. పిల్లలు లేరు. చాణక్య హఠాన్మరణంతో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. నలుగురితో స్నేహంగా మెలిగే ఆమె, మహానటి సావిత్రికి మంచి స్నేహితురాలు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది బాలసరస్వతినే అనే ప్రచారమూ ఉంది. వృత్తిపరంగా పోటీ పెరిగి అవకాశాలు తగ్గడం, మద్యానికి బానిస కావడం ఆమె చివరి రోజులను దుర్భరంగా మార్చాయి. మద్రాసు వదిలి గూడూరు చేరుకున్న బాలసరస్వతి, 1983 సెప్టెంబర్ 10న దీనమైన పరిస్థితుల్లో కన్నుమూశారు.
[Surabhi Balasaraswati Untold Life Story, Surabhi Balasaraswati, Surabhi Balasaraswati story, Surabhi Balasaraswati movies, Yesteryear Telugu actress Balasaraswati, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]






