ENGLISH | TELUGU  

ఎన్టీఆర్ పై సుమన్ కీలక వ్యాఖ్యలు..దేవర రిలీజ్ టైంలో అవసరమా!

on Sep 17, 2024

హీరోగా సుమన్(suman)సాధించిన ఘన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్,విలన్ గాను రాణిస్తు  తన సత్తా చాటుతున్నాడు. ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల గురించి గాని, లేదా బయట వ్యక్తుల గురించి గాని చాలా తక్కువగా మాట్లాడతాడు.అలాంటి సుమన్ ఇప్పుడు విడుదలకు ముందే ప్రీ సేల్స్ లో  'దేవర' (devara)సాధిస్తున్న రికార్డులపై  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.


ఎన్టీఆర్(ntr)ఎంతో అదృష్టవంతుడు.  విడుదలకి ముందే దేవర అన్ని రికార్డులు సాధించడమంటే మాములు విషయం కాదు. పైగా ఇలాంటి ఫీట్ అందరి నటులకి సాధ్యపడే అవకాశం లేదు.ఎన్టీఆర్ తో పాటు  స్టోరీ, టీం, దర్శకుడు వల్ల కూడా దేవర కి క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ చిన్నప్పట్నుంచి క్లాసికల్ డాన్సర్ .అందుకే ఆయన ఏ స్టెప్ వేసినా కూడా అందులో గ్రేస్ ఉంటుంది. డైలాగ్స్ చెప్పడం కూడా ఎన్టీఆర్ కి చిన్నపట్నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఫైట్స్ పై కూడా మంచి అవగాహన ఉంది. వృత్తి పట్ల  ఎంతో అంకిత భావం, నిబద్దత ఉన్న తారక్ కి ఒక ఆర్టిస్ట్ గా తెరపై తనేం చెయ్యాలో తారక్ కి  తెలుసు. అదే విధంగా  సెట్లో అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ప్రతి సన్నివేశాన్ని టీం తో చర్చించడమే కాకుండా అందుకు తగ్గ సలహాలు సూచనలు కూడా ఇస్తుంటాడు.ఆయనతో కలిసి మరోసారి వర్క్ చేసేందుకు ఎదురు చూస్తున్నాను. అలాగే  దేవర మంచి విజయాన్ని అందుకోవాలని  కూడా  కోరుకుంటున్నానని చెప్పాడు. సుమన్ ఎన్టీఆర్ కలిసి 'దమ్ము' లో తండ్రి కొడుకులుగా చేసారు.

 

 

ఇక దేవర సెప్టెంబర్ 27 న ఎన్టీఆర్ కెరీర్ లోనే  వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో  విడుదల కాబోతుంది.ఎన్టీఆర్ సోలో హీరోగా ;అరవింద సమేత' తర్వాత వస్తుండంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 27 కి ఉన్న స్పెషల్ ఏంటంటే ఎన్టీఆర్ మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'స్టూడెంట్ నెంబర్ వన్' ఇదే డేట్ కి రిలీజ్ అయ్యింది.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.