
సుకుమార్ ఫస్ట్ సినిమా ఆర్య నుంచి మొన్నటి పుష్ప 2 వరకు చూసుకోండి. హీరోయిన్ రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా అని హీరో ఇమేజ్ కొంచం కూడా డౌన్ లో ఉండదు. అభిమానులు, తెలుగు సినిమా హీరో ప్రేమికులు కోరుకునే మాస్ మసాలా అంశాలన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటూనే హీరోయిన్ మెప్పించడం విషయంలోనూ డోకా ఉండదు. సుకుమార్ కథలు ఆ విధంగానే పుడతాయి. సుకుమార్ నే కాదు, తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలసిందే. అలా ఇస్తేనే సినిమా అందరకి నచ్చుతుంది.
ఇక సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన నూతన దర్శకులు ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే, ఆయన శిష్యులైన బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల రూపొందించిన 'పెద్ది', 'ది ప్యారడైజ్' వంటి భారీ చిత్రాలలో హీరోయిన్ ల క్యారెక్టర్స్ రూపకల్పన చూశాక, అభిమానుల్లోనూ మరియు సినీ విశ్లేషకుల్లోనూ ఒక పెద్ద చర్చ మొదలైంది. ఈ నెల జూన్ 4న విడుదలైన 'పెద్ది' పర్వాలేదనే స్థాయిలో మెప్పించింది. కానీ వాస్తవం ఏంటంటే అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేదు.ఈ మూవీలో జాన్వీ కపూర్ పోషించిన 'అచియ్యమ్మ' పాత్ర విస్తృత విమర్శలకు గురైంది. సుకుమార్ సినిమాల్లో కథానాయికలకు ఉండే స్వయంప్రతిపత్తి లేదా పటిష్టమైన భావోద్వేగ ప్రభావం అచ్చాయమ్మా రోల్ లో కనిపించలేదని ప్రేక్షకులు భావించారు. ముఖ్యంగా కొన్ని వివాదాస్పద సన్నివేశాల విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఏకంగా 100% వివాదాస్పద శైలిని అంగీకరిస్తూ దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా క్షమాపణలు చెప్పి, కొన్ని సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.
ఇప్పుడు నానితో శ్రీకాంత్ ఓదెల చేసిన 'ది ప్యారడైజ్' లో కయాదు లోహర్ కథానాయికగా నటించింది. అంతకుముందు వచ్చిన వీరి 'దసరా' చిత్రంలో కీర్తి సురేష్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నప్పటికీ, 'ది ప్యారడైజ్' కి వచ్చేసరికి కథ మొత్తం కథానాయకుడి చుట్టూ, రా యాక్షన్ మరియు వయోలెన్స్ ఎలిమెంట్స్ చుట్టూనే తిరిగింది. హీరోయిన్ క్యారక్టర్ కి కేవలం కొన్ని విజువల్ షాక్ వాల్యూ ఎపిసోడ్లు తప్ప, కథను నడిపించే పటిష్టమైన ఎమోషనల్ ఆర్క్ లభించలేదు. పైగా క్యారక్టర్ డిజైన్ చేసిన విధానంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే, గురువు సుకుమార్ నుండి శిష్యులు కథ చెప్పే శైలిని, క్రాఫ్ట్‌ను నేర్చుకున్నప్పటికీ, ఎంచుకున్న జోనర్లు భిన్నంగా ఉండటమే ప్రధానంగా కనిపిస్తుంది. బుచ్చిబాబు మరియు శ్రీకాంత్ ఇద్దరూ తమ చిత్రాలలో హై-వోల్టేజ్ యాక్షన్, రా అండ్ రస్టిక్ వరల్డ్ బిల్డింగ్, మాస్ ఎలిమెంట్స్‌కే 80% పైగా ప్రాధాన్యత ఇచ్చారు. రామ్ చరణ్, నాని వంటి పాన్-ఇండియా స్టార్ల మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేసే క్రమంలో, కథలోని ఇతర అంశాలపై పెట్టిన శ్రద్ధ హీరోయిన్ల క్యారెక్టరైజేషన్‌పై చూపించలేకపోయారు.
ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల సెకండ్ ఫిలిం సెంటిమెంట్: ప్యారడైజ్ మూవీ రిజల్ట్ నిజమేనా?

కేవలం గ్లామర్ లేదా ప్రోటోగానిస్ట్ ప్రయాణానికి ఒక చిన్న సాధనంగా మారారే తప్ప, కథని శాసించే స్థాయికి ఎదగలేకపోయారు. సుకుమార్ చిత్రాల్లో ప్రేమ మరియు భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో, యాక్షన్ కూడా అంతే పద్ధతిగా ఉంటుంది. కానీ ఆయన శిష్యులు కేవలం 'రా యాక్షన్' వాతావరణంపైనే ఎక్కువ దృష్టి సారించడం వల్ల, సుకుమార్ బ్రాండ్ మార్క్ అయిన నారీ పాత్రల విశిష్టత ఈ చిత్రాల్లో తగ్గినట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ దర్శకులు కేవలం మాస్ ఎలిమెంట్స్‌కే కాకుండా, బలమైన స్త్రీ పాత్రలను రూపొందించే దిశగా అడుగులు వేస్తేనే సుకుమార్ వారసత్వానికి సరైన న్యాయం జరుగుతుందని సినీ రంగుల ప్రపంచం అభిప్రాయపడుతోంది.
[Sukumar Disciples Heroine Roles Analysis, Sukumar About Buchi Babu Sana, Sukumar About Srikanth Odela, Heroine Roles Telugu Cinema, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne]





