
పుష్ప, పుష్ప-2 చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొంది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఘనత పొందిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుకుమార్ బాటలోనే ఆయన తనయురాలు, ప్రముఖనటి సుకృతి వేణి బండ్రెడ్డి కూడా విభిన్న బాటలో పయనిస్తోంది.. 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను అవార్డు సాధించిన సుకృతి వేణి ఇప్పుడు మరో అరుదైన ఘనతని కైవసం చేసుకుంది. అమెరికాలోని బోస్టన్‌లో ఉండే అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్కూల్‌లో సంగీత విభాగంలో ఎన్‌సెంబల్ ఎక్సెలన్స్ అవార్డుని ఎంపికై ఫుల్ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుంది.
ఈ స్కాలర్ షిప్ కోసం మొత్తం 272 మంది పిల్లలు ఆడిషన్ ఇవ్వగా, కేవలం 14 మందికి మాత్రమే ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. అందులో కూడా సింగర్స్ విభాగంలో పూర్తి స్కాలర్ షిప్ పొందిన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి కావడం విశేషం.
Also read: అపరిచితుడు తెలుసుగా: రెండేళ్లు విషపూరితమైన వ్యక్తితో గడిపా..అనుపమ సంచలన వ్యాఖ్యలు
Sukumar, Sukriti Veni, Berklee College of Music






