Home

»

Latest News

ఎన్నాళ్ళో వేచిన ఉదయం: సుడిగాలి సుధీర్ 'GOAT'కు మోక్షం.!

Oct 1, 2026 2:09PM

టెలివిజన్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్ నటించిన మాస్ ఎంటర్‌టైనర్ 'GOAT'. అనేక వాయిదాలు, రకరకాల వివాదాలు, ఎన్నో అడ్డంకుల తర్వాత... ఎట్టకేలకు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌‌కు డేట్ ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 12న థియేటర్లలో సందడి చేసేందుకు 'గోట్' సిద్ధమైపోయింది.

అసలు ఈ సినిమా మొదలైనప్పుడు 'పాగల్' మూవీ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. అయితే షూటింగ్ సాగుతుండగానే దర్శక నిర్మాతలకు మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో ఊహించని విధంగా నరేష్ కుప్పిలి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. కానీ నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, దర్శకుడు వేదవ్యాస్‌కు బాధ్యతలు అప్పగించి, ఫస్ట్ కాపీని సిద్ధం చేశారు.

నిజానికి ఈ యేడాది ప్రారంభంలోనే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని మార్చిలోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. ఆ తర్వాత కూడా కొన్ని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం నవంబర్ 12న పక్కాగా థియేటర్లలో ల్యాండ్ అవుతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సినిమాలో తమిళ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుండగా.. సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, 'ఆడుకాలం' నరేష్, రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇది కూడా చదవండి: రూ.7000 కోట్లు ఇవ్వాల్సిందే.. AI కంపెనీకి షాకిచ్చిన బాలయ్య హీరోయిన్.!

 

 

[Sudigali Sudheer GOAT release date, Sudheer GOAT November 12, Sudheer GOAT Release Date, Sudigali Sudheer GOAT Movie, GOAT Movie Telugu, Sudigali Sudheer, Divya Bharti, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com