సోషల్ మీడియాలో మహేష్,రాజమౌళి సినిమాకి చెందిన వీడియో..ఇది ఎవరి పని
on Jan 25, 2025
రాజమౌళి(Rajamouli),మహేష్ బాబు(Mahesh Babu)కాంబోలో తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ జనవరి 2 న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే.ssmb 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ,ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)అయితే హీరోయిన్ గా ఖాయమయినట్టే. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ రావడం,లుక్ టెస్ట్ జరగడం కూడా అయిపోయాయి.మేకర్స్ నుంచి ఈ విషయంపై అధికారప్రకటన రావడమే మిగిలి ఉంది.
తాజాగా రాజమౌళి సోషల్ మీడియాలో చూడటానికే భయాన్ని కలిగించేలా ఉన్న ఒక సింహం బోనులో ఉంటే,రాజమౌళి ఆ సింహం ముందు నిలబడి పాస్ పోర్ట్ ని చూపిస్తున్నాడు.దీంతో రాజమౌళి ఆ సింహాన్ని షూట్ కోసం లాక్ చెయ్యడానికి వెళ్తున్నాడనే విషయం అర్థమయిపోతుంది.ఈ వీడియోకి 'క్యాప్చర్' అనే క్యాప్షన్ ని కూడా ఉంచాడు.మహేష్ ఆ వీడియోకి 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అని పోకిరి సినిమాలోని డైలాగుని కామెంట్ గా పోస్ట్ చేసాడు.ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటు నవ్వుతున్న ఎమోజీ ని షేర్ చేసింది.ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, మహేష్, రాజమౌళి అభిమానులైతే షూటింగ్ ప్రారంభం కాబోతుందనే ఆనందంలో ఉన్నారు.
అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ మూవీగా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆర్ ఆర్ ఆర్(RRR)తో ఆస్కార్ ని గెలుచుకొని రాజమౌళి హాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని పొందాడు.పైగా విదేశీ నటులు కూడా మహేష్ మూవీలో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.దీంతో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.విజయేంద్రప్రసాద్(Vijayendhra Prasad)కథని అందిస్తున్న ఈ మూవీని దుర్గ ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ(Kl Narayana)నిర్మిస్తున్నాడు.1000 కోట్ల బడ్జెట్ అనే టాక్ అయితే వినపడుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
