
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు హాలీవుడ్లో సినిమా చేయాలనే తన కోరికను బయటపెట్టారు. కనీసం ఒక్క హాలీవుడ్ చిత్రానికైనా దర్శకత్వం వహించాలని ఉందని వెల్లడించారు.
బ్రెజిల్లో జరుగుతున్న 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న రాజమౌళి.. తన హాలీవుడ్ అవకాశాలు, తదుపరి ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హాలీవుడ్ నుంచి తనకు చాలా ఆఫర్లు వచ్చాయని రాజమౌళి తెలిపారు. అక్కడి సినిమా నిర్మాణ విధానం, పని చేసే తీరు అద్భుతంగా ఉంటాయని.. ఆ పరిశ్రమ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు.
హాలీవుడ్లో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనేది తన కోరిక అని స్పష్టం చేశారు. అయితే, ఆ అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోలేకపోవడానికి కారణం ప్రస్తుతం తాను చేస్తున్న ‘వారణాసి’ అని వెల్లడించారు.
ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం తన వల్ల కాదని.. ఒక సినిమా పూర్తిగా పూర్తయిన తర్వాతే మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని రాజమౌళి వివరించారు. ‘వారణాసి’ పూర్తయిన తర్వాత హాలీవుడ్ ఆఫర్ల గురించి కచ్చితంగా ఆలోచిస్తానని తెలిపారు.

ప్రస్తుతం రాజమౌళి దృష్టి మొత్తం మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పైనే ఉంది. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కూడా రాజమౌళి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ మరో 10 రోజుల పని మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.!
[SS Rajamouli Hollywood Entry, SS Rajamouli Hollywood Debut, SS Rajamouli Varanasi Movie, Varanasi Movie, SS Rajamouli, Mahesh Babu, Priyanka Chopra, Telugu Film News]




.webp)

