Home

»

Latest News

Jaya Krishna: శ్రీనివాస మంగాపురం ఆ థియేటర్ లో ఎన్ని రోజులు ఆడబోతుంది..ఘట్టమనేని పేరు నిలబెడతాడా! 

Jun 27, 2026 11:40AM

-జులై 9 న వస్తున్న శ్రీనివాస మంగాపురం 
-ఘట్టమనేని మూడో వారసుడిపై భారీ అంచనాలు 
-అభిమానుల్లో వైరల్ గా మారిన ఆ థియేటర్ 

సూపర్ స్టార్ కృష్ణ(krishna),మహేష్ బాబు(Mahesh Babu)కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. దీంతో 'శ్రీనివాస మంగాపురం'(Srinivasa mangapuram)తో ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు ఘట్టమనేని జయకృష్ణకి సదరు ఫ్యాన్ బేస్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఈ క్రమంలోనే కృష్ణ, మహేష్ అభిమానుల్లో జయకృష్ణకి సంబంధించిన ఆసక్తికర న్యూస్ ఒకటి చర్చకి వస్తుంది.

సుదర్శన్ థియేటర్.. హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సింగల్ స్క్రీన్ థియేటర్. ఈ థియేటర్ కి కృష్ణ, మహేష్ కి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఆ ఇద్దరి నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు సుదర్శన్ లో శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. దీంతో అభిమానుల్లో సదరు థియేటర్ సెంటిమెంట్ గా మారిపోయింది. సెంటిమెంట్ గా మారడమే కాదు, కృష్ణ, మహేష్ సినిమాలు సుదర్శన్ లోనే రావాలని డిస్ట్రిబ్యూటర్స్ కి అల్టిమేటం జారీ చేసే పరిస్థితి. కృష్ణ, మహేష్ కూడా అభిమానుల కోరిక మేరకు తమ సినిమాలు సుదర్శన్ లోనే రిలీజ్ చెయ్యడంతో పాటు సదరు థియేటర్ ని తమ సొంత థియేటర్ అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.


Also read: Bhagyaraj: తమిళ స్క్రీన్ ప్లే మాంత్రికుడు భాగ్యరాజ్..తెలుగులో రీమేక్ అయిన అద్భుత చిత్రాలు


శ్రీనివాస మంగాపురం జులై 9 న రిలీజ్ కాబోతుంది. దీంతో అభిమానులు తమ సెంటిమెంట్ తో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ సెంటి మెంట్ ప్రకారం సుదర్శన్ లోనే శ్రీనివాస మంగాపురం రిలీజ్ కావాలని కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. శ్రీనివాస మంగాపురం మేకర్స్ కూడా ఘట్టమనేని ఫ్యామిలీకి ఉన్న ట్రాక్ దృష్ట్యా సుదర్శన్ లోనే రిలీజ్ చెయ్యడం ఖాయం. ఈ నేపథ్యంలో ఘట్టమనేని మూడో వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం సుదర్శన్ లో ఎన్ని రోజులు ఆడుతుందనే ఆసక్తి అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఉంది.    

 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com