
కొందరిని తలుచుకోవడం అవసరమే కాదు. మన మానవ జన్మ చరితార్ధతకి ఒక నిదర్శనం కూడా. ఆయనే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తన అద్భుతమైన స్వరంతో పాటని ప్రతి తెలుగు వారి ఆరో ప్రాణంగా మార్చిన కారణ జన్ముడు. తెలుగు జాతికి ఎనలేని కీర్తిని, గర్వాన్ని తెచ్చిన సుస్వర ప్రవాహం. సుమారు ఐదు పదుల కాలం పాటు సాగిన ఆయన సంగీత ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఏకంగా 16 భాషల్లో 50,000 కంటే ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఒకే రోజులో 21 పాటలు రికార్డు చేసి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు కూడా.
ఇది కూడా చదవండి: వైరల్ మీనింగ్ మార్చేసిన 'జ్యోతి పూర్వాజ్'.. ఆ పిక్స్ వైరల్
.webp)
ప్రతీ భాషలోనూ అక్కడి మాండలికానికి, భావానికి అనుగుణంగా స్పష్టమైన ఉచ్చారణతో పాడటం ఆయనకే చెల్లింది. అందుకే సంగీత రంగంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. విజయాలు అపారమైనవి. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఏకంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను దక్కించుకోవడమే కాకుండా, పదుల సంఖ్యలో నంది పురస్కారాలను మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల గౌరవాలను అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన అసమాన ప్రతిభను గుర్తించి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ మరియు ఆయన మరణానంతరం 2021లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించింది. కానీ చావు ఎప్పుడు ఏడుస్తుండే విషయం ఏంటంటే బాలు గారికి చావు లేదని.. ఈ విషయం చావుకే బాగా తెలుసు. 2020 సెప్టెంబర్ 25 న బాలు గారు భువి నుంచి దివికి ఏగారు
[SP Balasubrahmanyam death anniversary, SP Balasubrahmanyam, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




