సొర్గవాసల్ మూవీ రివ్యూ
on Dec 29, 2024
నటీనటులు: ఆర్జే బాలాజీ, సెల్వ రాఘవన్, కరుణాస్, నటరాజ సుబ్రహ్మణియన్, సానియా ఇయ్యప్పన్
ఎడిటింగ్: సెల్వ
మ్యూజిక్: క్రిస్టో సేవియర్
సినిమాటోగ్రఫీ: ప్రిన్స్
నిర్మాతలు: సిద్దార్థ్ రావ్ , పల్లవి సింగ్
దర్శకత్వం: సిద్దార్థ్ విశ్వనాథ్
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
కథ:
చెన్నైలోని ఓ ప్రాంతంలో పార్తీబన్ (ఆర్జే బాలాజీ) తోపుడు బండిపై టిఫిన్స్ అమ్ముతూ తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న రేవతితో అతను ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బ్యాంక్ లోన్ తీసుకుని ఓ మాదిరి హోటల్ పెట్టాలనేది చాలా కాలంగా అతనికి ఉన్న కోరిక. అయితే అనుకోకుండా ఓ హత్య కేసులో పార్ధీవన్ జైలుకి వెళ్తాడు. అదే జైల్లో గ్యాంగ్ స్టర్ గా ఉన్న 'సిగా' (సెల్వ రాఘవన్)కి అక్కడి ఖైదీలతో పాటు పోలీసులు కూడా భయపడుతూ ఉంటారు. 'సిగా' అనుచరులుగా టైగర్ మణి - శీలన్ ఉంటారు. ఆ ఇద్దరినీ దాటి సిగాను కలవడం అంత తేలికైన విషయం కాదు. పార్తీబన్ వచ్చి వాళ్ల మధ్యలో పడతాడు. సిగా గురించి అప్పుడే అతను వింటాడు. సాధ్యమైనంత త్వరగా జైలు నుంచి బయటపడాలనుకుంటాడు. 'సిగా'ను లేపేస్తే, విడుదల చేస్తానని పార్తీబన్ కి ఎస్పీ సునీల్ కుమార్ ఆశపెడతాడు. అప్పుడు పార్తీబన్ ఏం చేస్తాడు? షణ్ముగాన్ని ఎవరు చంపారు? జైలు నుంచి పార్తీబన్ బయటపడతాడా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
జైలుకి వెళ్ళిన పార్ధీబన్ నిజంగా హత్య చేశాడా లేదా అతడిని ఆ కేసులో ఇరికించారా లేదా అనే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. అయితే కథలోకి వెళ్ళే కొద్దీ క్యారెక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. ఒకానొక దశలో ఏంట్రా ఈ జైలు, ఖైదీలు అనే ఫీలింగ్ వస్తుంటుంది. అయితే సాధారాణ జీవితాన్ని గడిపే ఓ వ్యక్తి జీవితాన్ని జైలులోని కొంతమంది గ్యాంగ్ స్టర్స్ ఏం చేశారోననే భాధ చూసే ప్రతీ ఒక్కరికి కలుగుతుంది.
కొట్లాట, ఎత్తుకి పై ఎత్తు వేయడం, నరుక్కోవడం, హత్యలు, రేప్ లు ఇలాంటివి క్రైమ్ థ్రిల్లర్స్ లో సహజం. అవి ఇందులోను ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి పార్ధీవన్ చాలా సాధారణంగా కనిపిస్తాడు. ఎందుకంటే అతను లైఫ్ చాలా సాదాసీదాగా ఉంటుంది. అతనికి ఓ ఫ్యామిలీ ఉందని, దానికోసం ఎలాగైనా జైలు నుండి బయటకెళ్ళాలని అతను పడే తపన ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది.
పోలీసుల ఇగో ఓ వైపు, సామాన్యుడి జీవితం ఓ వైపు అనేలా కథ ముందుకు సాగడంతో ఉత్కంఠ మొదలవుతుంది. అయితే ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్ అందరిని ఆలోచనలో పడేస్తుంది. చేయని క్రైమ్ కి అతను ఎందుకు అంగీకరించాడనే పర్ స్పెక్టివ్ భిన్నంగా అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే.. కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్కరిని మరోసారి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలతో కథ ఫుల్ ఆఫ్ థ్రిల్ ని పంచుతుంది. అయితే జైలులో ఓ రౌడీ నాలుకని కోసే సీన్ చూపించినప్పుడు మరీ ఇంత క్రూరంగా ఎలా ఉంటార్రా అనిపిస్తుంది. అయితే ఓ మనిషిని మార్చేది అతని చుట్టూ ఉండే పరిస్థితులు అంటూ దర్శకుడు చూపించిన పాయింట్ కొత్తగా ఉంటుంది. ప్రిన్స్ ఫోటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఒకే. ఎడిటింగ్ ఫ్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
పార్ధీబన్ గా ఆర్జే బాలాజీ నటన ఆకట్టుకుంది. సిగా పాత్రలో సెల్వరాఘవన్ ఒదిగిపోయాడు. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్ మస్ట్ వాచెబుల్.
రేటింగ్: 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్
Also Read