
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ పేరు తెలుగు ప్రేక్షకుల్లో మరింతగా వినిపిస్తోంది. అయితే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి తన స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ కవర్ పేజీ కోసం చేసిన లేటెస్ట్ ఫోటోషూట్‌లో శోభిత కనిపించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గ్రే కలర్ క్రాప్డ్ ఫాక్స్ ఫర్ జాకెట్, బ్లాక్ అవుట్‌ఫిట్, గోల్డ్ బెల్ట్‌తో శోభిత ఇచ్చిన కవర్ లుక్ ప్రత్యేకంగా నిలిచింది. మరో లుక్‌లో బ్లాక్ హాల్టర్ నెక్ డ్రెస్, స్ట్రాపీ కట్-అవుట్స్‌తో కనిపించింది. ప్లమ్ కలర్ బాడీసూట్, మెజెంటా వన్-షోల్డర్ డ్రేప్, క్రిస్టల్ ఫ్రింజ్‌తో కూడిన హై బూట్స్‌తోనూ కెమెరాకు పోజులిచ్చింది.
2024 డిసెంబర్‌లో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత.. తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌పైనా దృష్టి పెడుతోంది. మ్యాగజైన్ కవర్ షూట్‌లో ఆమె ఎంచుకున్న దుస్తులు, ఇచ్చిన పోజులు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. పెళ్లి తర్వాత ఆమె లుక్‌లో వచ్చిన మార్పుల గురించి కొందరు మాట్లాడుకుంటుంటే.. మరికొందరు ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను ప్రశంసిస్తున్నారు.
అయితే శోభితను కేవలం గ్లామర్ ఫోటోషూట్లతోనే గుర్తించలేం. ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘మంకీ మ్యాన్’ వంటి ప్రాజెక్టులతో విభిన్న భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పాత్రల ఎంపికలోనూ వైవిధ్యం చూపిస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
ప్రస్తుతం శోభిత నటిస్తున్న ప్రాజెక్టుల్లో పా. రంజిత్ దర్శకత్వంలోని ‘వెట్టువమ్’ ఒకటి. ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ రోల్ కోసం తన సర్వస్వం ధారపోశానని, చాలా కాలంగా ఇలాంటి పవర్‌ఫుల్ పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని ఆమె వెల్లడించింది.
ఒకవైపు ఫ్యాషన్ ప్రపంచంలో తన లుక్స్‌తో దృష్టిని ఆకర్షిస్తూనే.. మరోవైపు నటిగా కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి శోభిత సిద్ధమవుతోంది. మరి ‘వెట్టువమ్’లో ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: కంగనాపై అశ్లీల AI కంటెంట్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!
[Sobhita Dhulipala Photoshoot, The Hollywood Reporter India, Sobhita Dhulipala Latest Photos, Sobhita Dhulipala Instagram, Sobhita Photos, Sobhita Dhulipala, Vettuvam Movie, Telugu Film News]






