TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మోటార్‌సైకిల్ డైరీస్: సితార, రిషబ్ శెట్టి కాంబోలో క్రేజీ మూవీ.!

Nov 29, 2026 11:19AM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ఓ ఆసక్తికరమైన కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రిషబ్ శెట్టి ప్రజెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రతి మైలురాయి ఓ జ్ఞాపకంగా, ప్రతి మలుపు ఓ కథగా మారేలా సాగే ఓ అందమైన ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతోంది. గమ్యస్థానాల కంటే ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, జీవితంలో మరిచిపోలేని సంఘటనలకు ప్రాధాన్యతనిస్తూ ఓ హృద్యమైన ట్రావెల్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

శివా చిరంతన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, భువన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, ధరణి గంగెపుత్ర ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలోని నటీనటులు, ఇతర పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

ఇది కూడా చదవండి: అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్.. రామాయణం అనౌన్స్‌మెంట్!

 

 

 

[MotorcycleDiarys, Sithara Entertainments, Rishab Shetty]

 

google-ad-img