Home

»

Latest News

రాకాలో తెలుగు బ్యూటీ

Jul 20, 2026 11:46AM

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Ajun)అట్లీ(Atlee),సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా'. ప్రపంచ స్థాయి ఖ్వాలిటీ, ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో 'రాకా' లో భాగస్వామ్యం కావాలని కోరుకుని నటులు లేరు. సోషల్ మీడియాకి కూడా పెద్ద అసెట్ గా నిలుస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తాజాగా ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. 


' పలు సినిమాల్లో విభిన్న క్యారెక్టర్స్ లో కనిపించిన అచ్చ తెలుగు భామ  సిరి హనుమంతు(Siri Hanumanth)రాకా'లో కీలక రోల్ లో కనిపించబోతుంది. ఇటీవల జరిగిన ఒక సినీ వేడుకలో ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో  ఈ న్యూస్ నెట్టింట  వైరల్ గా మారింది. ఒకవైపు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ, మరోవైపు వెబ్ సిరీస్, సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి, అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ స్టార్ నటిస్తున్న 100 శాతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం కావడం అంటే మామూలు విషయం కాదు.  దీంతో  సిరి హనుమంతు కెరీర్‌ కి రాకా టర్నింగ్ పాయింట్ గా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


Also read: నిరాశపరుస్తున్న జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్.. ఆ హీరో రికార్డుని దాటడం కష్టమేనా!

ప్రస్తుతం రాకాకి సంబంధించిన షూటింగ్ ముంబైలో శరవేగంగా కొనసాగుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకునే ఒక హీరోయిన్ గా చేస్తుండగా, మరింత మంది భామలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయినప్పటికీ చిత్రబృందం ఇప్పటివరకు పూర్తి తారాగణం వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ ఐకానిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిసిన 'రాకా' 2027 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

allu arjun, raaka, siri hanumanth, atlee, deepikapadukone

 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com