
సందీప్ కిషన్ వన్ మాన్ షో గా భావిస్తున్న' సిగ్మా' కి సౌత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందుకు ప్రధాన కారణం ఇళయ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడు కావడమే అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. నిన్న నైట్ 'సిగ్మా' ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాని ఊపేస్తోంది.
2 నిమిషాల 16 సెకన్ల విజువల్ వండర్, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలని ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది ట్రైలర్ ప్రారంభంలోనే కథా నేపధ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. సమాజంలో అందరిచేత ఒక లూజర్‌గా, ఫెయిల్యూర్‌గా ముద్ర వేయబడిన ఒక సాధారణ రేడియో జోకీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథానాయకుడు సందీప్ కిషన్ తన జీవితంలో ఎదురైన అవమానాలను దాటుకుని, అండర్‌వర్ల్డ్ డ్రగ్ మాఫియా కింగ్‌పిన్ కొట్లపాటి వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్) సామ్రాజ్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్‌తో ఒక ప్రమాదకరమైన హైస్ట్‌కు శ్రీకారం చుడతాడు. జూదం, డ్రగ్స్, అక్రమ దందాల ప్రపంచంలో సాగే హై-స్టేక్స్ ట్రెజర్ హంట్ ఎపిసోడ్లు విజువల్‌గా నెక్స్ట్ లెవెల్‌లో డిజైన్ చేయబడ్డాయి. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాత్ర హీరోతో సాగే లవ్, హ్యూమర్, అడ్వెంచర్ సీన్స్‌లో కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రేక్షకులు మరి అంత ఎర్రి ఎంగళప్పల్లా కనిపిస్తున్నారా:ఒక మాదిరిగా కూడా కాదా!
జేసన్ సంజయ్ తన తొలి సినిమాలోనే అత్యుత్తమ టేకింగ్, విజువల్ సెన్స్‌తో, ట్రెండీ పల్స్ పట్టుకుని మాస్ ప్లస్ క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా కథనాన్ని మలిచినట్టుగా అర్ధమవుతుంది. సాంకేతికంగా ఈ సినిమా అత్యంత ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతీ యాక్షన్ ఫ్రేమ్‌కు ప్రాణం పోసింది. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ ట్రైలర్‌ను అత్యంత వేగవంతంగా, థ్రిల్లింగ్‌గా మార్చాయి. రాజు సుందరం, శివ్ పండిట్, అన్బు దాసన్, యోగ్ జేపీ, షీలా రాజ్‌కుమార్ వంటి బలమైన తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 2, 2026న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తోంది. 'ఒక విషయాన్నీ సృష్టించడం ఎంత కష్టమో, దాన్ని కాపాడుకుంటూ ఉండటం అంత కంటే ఎక్కువ కష్టం' అనే పాయింట్ సిగ్మా కథ పుట్టుకకి కారణం.
మీకు నచ్చవచ్చు : మగవాళ్ల పీరియడ్స్ పై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు
[Sigma Trailer, jasan sanjay, Sundeep Kishan, Faria Abdullah, Lyca Productions, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]






