Home

»

Latest News

రవితేజ బయోపిక్‌లో సిద్ధు జొన్నలగడ్డ!

Oct 13, 2025 4:07PM

ఇప్పటివరకు ఎంతో మంది సినీ ప్రముఖుల బయోగ్రఫీలు వెండితెరపై వచ్చాయి. అయితే అందులో కొన్ని ఘన విజయం సాధించగా, మరికొన్ని ప్రేక్షకాదరణ పొందలేదు. ప్రముఖుల జీవితాల్లోని వెలుగు నీడల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలోనే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అయితే ఎక్కువ శాతం చనిపోయిన సినీ ప్రముఖుల బయోగ్రఫీలు ఇప్పటివరకు వచ్చాయి. బ్రతికి ఉన్న వారి జీవిత చరిత్రలను తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి చూపించడం లేదు. అలాంటి బయోగ్రఫీని తీసేందుకు హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విశేషాలను సిద్ధు తన కొత్త సినిమా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో తెలియజేశారు. 

బయోగ్రఫీ చేసే విషయంలో అందరికంటే భిన్నంగా ఆలోచించాడు సిద్ధు జొన్నలగడ్డ. మన మధ్యే ఉంటూ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్న మాస్‌  మహారాజ రవితేజ బయోగ్రఫీని తెరకెక్కించేందుకు ఐదేళ్ళ క్రితం ఒక ప్రయత్నం మొదలు పెట్టాడు సిద్ధు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మొదట్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసి ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాలు అందుకున్న రవితేజ జీవితం సిద్ధుని ఎంతో ఇన్‌స్పైర్‌ చేసిందట. 

స్వతహాగ రైటర్‌ కూడా అయిన సిద్ధు.. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రంతో హీరోగా, రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో రవితేజ బయోగ్రఫీపై రీసెర్చ్‌ మొదలు పెట్టాడు. అయితే ఆ తర్వాత నటుడిగా, రచయితగా బిజీ అయిపోవడంతో ఆ ప్రయతాన్ని విరమించుకున్నాడు. సిద్ధు లేటెస్ట్‌ మూవీ ‘తెలుసు కదా’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే రవితేజ కొత్త సినిమా ‘మాస్‌ జాతర’ ఈనెల 31న రిలీజ్‌ కాబోతోంది. ఈ రెండు సినిమాలకు కలిపి చేసిన ఒక ప్రమోషన్‌ కార్యక్రమంలో రవితేజ, సిద్ధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తను చేద్దామనుకున్న బయోపిక్‌ గురించి రవితేజతోనే చెప్పాడు సిద్ధు. దానిపై స్పందించిన రవితేజ.. ఎవరి బయోపిక్‌ అయినా వారి జీవితంలోని పాజిటివ్‌ కోణాలను మాత్రమే టచ్‌ చేస్తే అది పరిపూర్ణం అవ్వదు. వారి జీవితాల్లోని నెగెటివ్‌ అంశాలు, వారు ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా ప్రస్తావిస్తేనే ఆ బయోపిక్‌కి న్యాయం జరుగుతుంది అన్నారు. అలా రవితేజ బయోగ్రఫీ కోసం తను చేసిన రీసెర్చ్‌ గురించి రవితేజతోనే చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com