
'బొమ్మరిల్లు' తో అన్ని వర్గాల ప్రేక్షకుల హార్ట్స్ ని దోచేశాడు సిద్దార్ద్. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆంథాలజీ సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 3' తో సందడి చేస్తున్నాడు. సందడి చేస్తుండటమే కాదు, ఓటీటీ ప్రపంచంలో 'లస్ట్ స్టోరీస్ 3' భారీ సంచలనం సృష్టిస్తోంది. నలుగురు ప్రముఖ దర్శకులు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా మరియు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన 4 విభిన్న కథలతో ఈ బోల్డ్ ఎమోషనల్ సిరీస్ రూపొందింది.
రియల్ లైఫ్ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి నటించిన ఎపిసోడ్ వీక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. దిగ్గజ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో సిద్ధార్థ్, అదితులు భార్యాభర్తలుగా అత్యంత సన్నిహిత సన్నివేశాల్లో నటించారు. అయితే నిజ జీవితంలో భార్యాభర్తలైనప్పటికీ, కెమెరా ముందు అలాంటి ఇంటిమేట్ సీన్స్‌లో నటించడంపై సిద్ధార్థ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'నిజ జీవితంలో జంటగా మారిన తర్వాత తెరపై అలా కలిసి నటించడం మొదట్లో చాలా వింతగా, కొద్దిగా అసౌకర్యంగా అనిపించింది.పెళ్లైన తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పటికీ, సెట్స్‌పై వందలాది మంది టెక్నీషియన్లు మరియు కెమెరాల మధ్య సాన్నిహిత్యాన్ని ప్రదర్శించడం సాధారణ విషయం కాదు.వృత్తిపరమైన బాధ్యతగా పాత్రకు 100% న్యాయం చేయడమే తమ ప్రధాన లక్ష్యం. అందుకే వ్యక్తిగత బంధాన్ని పక్కన పెట్టి నటులుగా మాత్రమే ఆ సన్నివేశాల్లో పాల్గొన్నాం.
ఇది కూడా చదవండి: థియేటర్ వ్యాపారంలోకి మెగాస్టార్: ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ నిర్మాణం.. ఎక్కడ అనుకున్నారు!
.webp)
అంతేకాకుండా, నటీనటులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పూర్తి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం కోసం హాలీవుడ్ తరహాలో ప్రత్యేకంగా 'ఇంటీమసీ కోఆర్డినేటర్' సహాయం తీసుకున్నట్లు సిద్ధార్థ్ వివరించారు. ఈ ఆంథాలజీ సిరీస్‌లో కేవలం సిద్ధార్థ్-అదితి జంట మాత్రమే కాకుండా విజయ్ వర్మ, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అలీ ఫజల్, రాధికా మదన్, అభిషేక్ బెనర్జీ, గుర్ఫతే పిర్జాదా, సనా థంపి మరియు గజరాజ్ రావు వంటి 10 మందికి పైగా దిగ్గజ తారాగణం కీలక పాత్రల్లో అలరించారు. ఆధునిక సమాజంలో స్త్రీల కోణంలో కోరికలు, మానవ సంబంధాలు, సంక్లిష్ట భావోద్వేగాలు మరియు సాన్నిహిత్యం చుట్టూ ఈ కథలు తిరుగుతాయి. 2024లో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వివాహం జరిగింది.
మీకు నచ్చవచ్చు: నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా: 28 ఏళ్ళయినా ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించే లవ్ సాంగ్.!
[Siddharth, Aditi Hydari, Siddharth About Lust Stories 3 Intimate Scenes With Aditi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






