TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుంది

Nov 18, 2024 11:15AM

ప్రముఖ నటి, యాంకర్ శ్యామల(shyamala)గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. సుదీర్ఘ కాలం నుంచే సినిమాల్లో చేస్తూ వస్తున్న శ్యామల ప్రస్తుతం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిని నిర్వహిస్తుంది.

శ్యామల రీసెంట్ గా ఒక టీవీ ఛానల్ లో మాట్లాడుతూ నిజాలని ఎవరు మార్చలేరు.మా వైసీపీ మహిళా కార్యకర్తలపై అసభ్య పోస్ట్ లు చేస్తున్న వారిని అఫిషియల్ హ్యాండిల్స్ తో సహా ప్రభుత్వం ముందు ఉంచాం.కానీ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు.ఈ ప్రభుత్వం వైఖరి చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉంటుంది.పాయింట్ అవుట్ చేస్తారు.మనం వాళ్ళని ప్రశ్నించే సరికి అక్రమ కేసులు పెట్టేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తొక్కేస్తారని చెప్పుకొచ్చింది.

దీంతో శ్యామల మాటలపై సోషల్ మీడియా యాక్టవిస్ట్  సంతుబాబు మాట్లాడుతు పవన్ కళ్యాణ్(pawan kalyan)ఇంట్లో ఆడవాళ్ళని పోసాని కృష్ణ మురళి(posani krishna murali)ఎంతో అసహ్యంగా బూతులు తిట్టాడు.కొడాలి నాని,వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు వంటి వారు చంద్రబాబు నాయుడు(chandrababu naidu)గారి భార్య భువనేశ్వరి గురించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు.తెలుగు దేశం మహిళా కార్యకర్తలని, జనసేన మహిళా కార్యకర్తలపై కూడా అసహ్యంగా పోస్ట్ లుచేస్తూ మాట్లాడారు.వైసిపీ సోషల్ మీడియా పేరుతో శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ ,పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారు.అప్పుడు నీకు మహిళలు గుర్తుకు రాలేదా. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోయే మనస్తత్వం శ్యామలది.బెట్టింగ్ యాప్ లని కూడా ప్రమోట్ చేసిందని సంతు బాబు చెప్పుకొచ్చాడు.

 

google-ad-img