
రమ్యకృష్ణ(Ramya Krishna).. శృతి హాసన్(shruti Haasan).. ఈ ఇద్దరి సినీ జర్నీ మధ్య తరాల తేడా ఉంది. ఇద్దరి కాంబోలో పెద్దగా సినిమాలు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది రమ్య కృష్ణకి సంబంధించిన అత్యంత రహస్యమైన సీక్రెట్ ని శృతి హాసన్ బయటపెట్టింది.
సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా తనదైన నటనతో, తిరుగులేని అందంతో అలరిస్తున్న సీనియర్ నటి రమ్యకృష్ణ అందానికి రహస్యం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఐదు పదుల వయసు దాటినా కూడా ఆమె ఇంకా అంత గ్లామరస్‌గా, ఎనర్జిటిక్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ ప్రశ్నలకె శృతిహాసన్ ఒక ఆసక్తికరమైన సమాధానాన్ని నెటిజన్ల ముందుకు తెచ్చారు. విమాన ప్రయాణంలో రమ్యకృష్ణతో కలిసి ప్రయాణించిన సమయంలో శృతిహాసన్ ఒక క్రేజీ వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా రమ్యకృష్ణ నిత్య యవ్వనంగా ఉండటానికి గల అసలైన డైట్ సీక్రెట్ బయటపడింది.
సాధారణంగా సెలబ్రిటీలు షూటింగ్‌ల కోసం లేదా పర్సనల్ పనుల కోసం నిరంతరం ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో విమానాలలో లేదా హోటళ్లలో దొరికే రకరకాల ఖరీదైన ఆహార పదార్థాలని తినడం మనం చూస్తుంటాం. కానీ రమ్యకృష్ణ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఆమె ప్రయాణాల్లో బయటి ఫుడ్‌కు వంద శాతం దూరంగా ఉంటారు. విమానంలో లభించే క్యాటరింగ్ ఆహారాన్ని తినడానికి అసలు ఇష్టపడరని శృతిహాసన్ ఈ వీడియోలో స్వయంగా వెల్లడించారు. తాము ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో రమ్యకృష్ణ తన సీటులో కూర్చుని ఎంతో ఇష్టంగా తింటున్న లంచ్ బాక్స్‌ను శృతిహాసన్ తన కెమెరాలో క్యాప్చర్ చేసి అభిమానులకి చూపించారు.
also read: Tamannaah: తమన్నాకి తెలుగులో అవకాశాలు లేవా.. ఆ మూవీ ఎఫెక్ట్ నిజమేనా!
ఆ లంచ్ బాక్స్ తెరిచి చూడగా, అందులో ఎలాంటి ఆయిలీ ఫుడ్స్ లేదా జంక్ ఫుడ్స్ లేవు. కేవలం తాజా పండ్ల ముక్కలతో ఆ బాక్స్ నిండి ఉంది. ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన పండ్లను, ఇంట్లో తయారుచేసుకున్న ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని మాత్రమే రమ్యకృష్ణ తన వెంట తెచ్చుకుంటారు. ఎంత పెద్ద స్టార్ హోదా ఉన్నప్పటికీ, బయటి ఫుడ్స్ జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో కూడిన హోమ్ మేడ్ ఫుడ్, ఫ్రూట్ డైట్ పాటించడమే ఆమె ఎప్పటికీ అంత అందంగా, చైతన్యవంతంగా ఉండటానికి ప్రధాన కారణం. నిత్యం వందల కోట్ల బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ, బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఆరోగ్యంపై ఆమె చూపిస్తున్న ఈ శ్రద్ధ నిజంగా ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం.





