Home

»

Latest News

శ్రియ ఇన్ స్టాగ్రామ్ పిక్ వైరల్

Aug 25, 2026 12:36PM

 


శ్రియ.. తెలుగుతో పాటు తమిళ సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటి యాక్టింగ్ ఇప్పట్లో ఎక్స్ పైరీ డేట్ లేదంటూ యువహీరో తేజ సజ్జకి తల్లిగా మిరాయ్ లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం  హిందీ చిత్రం 'ఆవారాపన్ 2' తో థియేటర్స్ లో సందడి చేస్తున్న శ్రియ రీసెంట్ గా ఇనిస్టాగ్రమ్ వేదికగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఒక పిక్‌ని షేర్ చేస్తూ, "హ్యాపీ డే" అనే ఆసక్తికర క్యాప్షన్‌ని జత చేసింది.

దీంతో రజనీకాంత్ హీరోగా అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధర్మన్’ లో రజినీకి శ్రియ జోడిగా చేస్తుందనే రూమర్ చాలా గర్వంతో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ధర్మాన్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ హైదరాబాద్ షెడ్యూల్ సమయంలోనే శ్రియ సెట్స్‌కు వచ్చి రజనీని కలవడంతో, ఆమె ఈ చిత్రంలో ముఖ్యమైన క్యారక్టర్ పోషిస్తుందని అంటున్నారు అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఐకానిక్  కాంబినేషన్ మళ్లీ తెరపై మెరవబోతోందన్న ఆలోచనే తమిళ, తెలుగు చలనచిత్ర అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. 


Also read: వివాదంలో ఇరుముడి.. ఆ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ 

రజనీ, శ్రియ అనగానే ప్రతి సినీ అభిమానికి ముందుగా గుర్తుకొచ్చేది శంకర్ దర్శకత్వంలో 2007లో వచ్చిన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ ‘శివాజీ’. ఆ సినిమాలో రజనీకాంత్‌కు జంటగా శ్రియ చేసిన నటన, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. సాంగ్స్ నేటికీ మారుమోగిపోతుంటాయి. ధర్మాన్ ని ఉలయ నాయగన్  కమల్ హాసన్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

Shriya Saran, Rajinikanth, Dharman, Kamal Haasan

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com