
సౌత్ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు కరుణాడ చక్రవర్తి 'శివరాజ్‌కుమార్'. ఇటీవల పెద్దిలో గౌరు నాయుడుగా అలరించిన శివరాజ్‌కుమార్ కి సొంత ఏరియా కర్ణాటకలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పుకుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. చూడని హిట్టు లేదు, కొట్టని రికార్డు లేదు. మొదటి మూడు సినిమాలు వరుసగా 100 రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.
శివ రాజ్‌కుమార్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకొని, ఆ తర్వాత అభిమానులకు, కన్నడ ప్రజలకి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఆయన నటించబోయే కొత్త బహుభాషా చిత్రం ‘ఒరిజినల్ మాన్‌స్టర్’ (Original Monster) టైటిల్ లాంచ్ వేడుకలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఒక విలేకరి హిందీ డైలాగులు చెప్పడం గురించి ప్రశ్నించగా, శివ రాజ్‌కుమార్ స్పందిస్తూ “హిందీ నాకు రెండో భాష, అది చాలా తేలికైన భాష. పైగా అది మన జాతీయ భాష కూడా. దానిని మనం ఎందుకు నేర్చుకోకూడదు?” అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ ఒక్క వ్యాఖ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన దుమారాన్ని రేపింది. కన్నడ భాషాభిమానులు, పలువురు నెటిజన్లు శివ రాజ్‌కుమార్ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో అధికారికంగా ఏ ఒక్క భాషకూ జాతీయ భాష హోదా లేదని, భారత్‌లో అన్ని ప్రాంతీయ భాషలూ సమానమేనని స్పష్టం చేస్తూ విమర్శలు స్టార్ట్ చేసారు. ఈ వివాదం నెట్టింట వ్యాపించి దాదాపు 100% ప్రతికూల చర్చకు దారితీయడంతో శివ రాజ్‌కుమార్ తక్షణమే స్పందించారు.

Also Read: నందమూరి మోక్షజ్ఞకి జోడీగా ఆ స్టార్ హీరోయిన్: ఈ హీరోయిన్ కూడా లిస్ట్ లో ఉంది
తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఆ సమయంలో హిందీని జాతీయ భాష అని పొరపాటున మాట్లాడాను. భారతదేశంలో ఉన్న అనేక ముఖ్యమైన భాషల్లో హిందీ కూడా ఒక భాష మాత్రమే. భారతీయ భాషల విషయంలో నేను కొంత గందరగోళానికి గురై ఆ పదాన్ని వాడాను. నాకు తెలియక జరిగిన ఈ పొరపాటుకి క్షమాపణలు. ఎవరి భాష వారికి గొప్పది, హిందీ మాట్లాడేవారికి ఆ భాష ఎంత ముఖ్యమో, కన్నడిగులకు కన్నడ భాష అంతకంటే ఎక్కువ ప్రాధాన్యమైనది. మా భాష గౌరవాన్ని మేమెప్పుడూ తగ్గిపోనివ్వం” అనిస్పష్టం చేశారు.
[Shiva Rajkumar, Hindi National Language, Apologises , Kannada remark, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]





