Home

»

Latest News

అగస్ట్ 1 న థియేటర్స్ లోకి వచ్చేస్తున్నా..మీరు రెడీనా!

Jul 24, 2026 1:06PM


కంటెంట్ బాగుండి స్నేహం నేపథ్యంగా వచ్చిన అనేక చిత్రాలకి ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ. ఆ కోవలోనే స్నేహానికి నిజమైన అర్థాన్ని, దానికోసం చేసే త్యాగాలని  అత్యంత తీవ్రమైన భావోద్వేగాలతో ఆవిష్కరించిన అరుదైన చిత్రాల్లో 'శంభో శివ శంభో' ఒకటి. 2010 సంవత్సరంలో విడుదలైన ఈ సంచలన చిత్రం, అప్పట్లో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీల త్రయం తమ అద్భుతమైన నటనతో వెండితెరపై మైమరిపించారు. నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించగా ,ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఇప్పుడు, దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

 ఆగస్టు 1వ తేదీన అంతర్జాతీయ 'ఫ్రెండ్‌షిప్ డే'  పురస్కరించుకుని 'శంభో శివ శంభో' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈసారి కేవలం సాధారణ రీ రిలీజ్ మాత్రమే కాకుండా, అత్యాధునిక 4K డిజిటల్ క్వాలిటీ, రీ మాస్టర్డ్ ఆడియో సాంకేతికతతో సరికొత్త దృశ్యరూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.  రీ-రిలీజ్ హంగామాను ముందే మొదలుపెడుతూ చిత్రయూనిట్ అభిమానులకు ఒక మాస్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. శనివారం సాయంత్రం సరిగ్గా 5:04 గంటలకి  ప్రత్యేక 4K ట్రైలర్‌ను ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ నాటి జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడమే కాకుండా, రీ-రిలీజ్ వేడుకలకు మరిన్ని ఊపునిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి  టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.  సోషల్ మీడియాలో ఇప్పటికే మూవీకి  సంబంధించిన ప్రత్యేక పోస్టర్లు  వైరల్ అవుతూ ట్రెండ్ సృష్టిస్తున్నాయి.

Also read: చిరంజీవి ఇంట్లో బాలకృష్ణ షూటింగ్.. వైరల్ గా మారిన క్రేజీ అప్డేట్ 


కర్ణ, సుధాకర్, చందు అనే ముగ్గురు స్నేహితుల మధ్య ఉండే అమితమైన బంధం, ఒక స్నేహితుడి ప్రేమ పెళ్లి కోసం వారు చేసే ప్రాణ త్యాగాలు, ఆ తర్వాత ఎదురయ్యే సమాజపు ఒడిదుడుకులు ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా  చిత్రీకరించబడ్డాయి. ప్రియమణి, అభినయ కథానాయికలుగా చెయ్యగా  ప్రతి ఒక్క క్యారక్టర్ ప్రేక్షకుల హృదయాలని నేరుగా హత్తుకుంటుంది.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com