అతనితో శృంగారం చెయ్యలేక పరిగెత్తిన అర్జున్ రెడ్డి ప్రీతి
on Jun 29, 2024
అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఒక్క విజయ్ దేవరకొండనే(vijay devarakonda)కాదు. షాలిని పాండే (Shalini Pandey)కూడా..ప్రీతి శెట్టి గా సెటిల్డ్ పెర్ఫార్మ్ తో అశేష ప్రేక్షాభిమానులని అలరించింది.ముఖ్యంగా దేవరకొండ తో చేసిన రొమాంటిక్ సీన్స్ ద్వారా అయితే కుర్రకారుకి ఫేవరేట్ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె కొన్ని షాకింగ్ విషయాలని బయటపెట్టింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నట వారసుడు జునైద్ ఖాన్ ఇటీవలే తెరంగ్రేటం చేసాడు. మహారాజ్ అంటూ మొన్న ఇరవై ఒకటవ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాకపోతే థియేటర్స్ లో కాకుండా ఓటిటి వేదికగా రిలీజ్ అయ్యింది. అందుకు అనేక కారణాలున్నాయని అనుకోండి.ఇక ఇందులో కిషోరీ అనే క్యారక్టర్ లో షాలిని మెరిసింది. కొన్ని ఇంటిమేట్ సీన్స్ ని కూడా చేసింది. అంటే ఫుల్ రొమాంటిక్ సీన్స్. వీటి గురించి మాట్లాడుతు శృంగార సీన్స్ లో నటించడం అంత సులభం కాదు. మహారాజ్ లో అలాంటి సీన్స్ చేసేటప్పుడు షూట్ నుంచి పారిపోయా. ఎందుకంటే అలాంటి వాతావరణం,చీకటి అంటే నాకు భయం. అందుకే బయటకి పరుగెత్తాను. ఆ తర్వాత డైరెక్టర్ నా పరిస్థితి అర్ధం చేసుకొని ప్రశాంతవరమైన వాతావరణాన్ని కల్పించాడు. అప్పుడు షూట్ ని కంప్లీట్ చేసానని చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో ఆ మాటలు వైరల్ అవ్వడంతో మరి విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేసేటప్పుడు భయం కలగలేదా అంటు కామెంట్స్ చేస్తున్నారు.ఇక మహారాజ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. షాలిని పోషించిన కిషోరీ క్యారక్టర్ కూడా ప్రేక్షకుల మెదడుల్లోకి దూరిపోయింది. 1800 వ సంవత్సరంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కగా సిద్దార్ధ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. ఆడవాళ్ళ మీద జరిగే అకృత్యాలని కళ్ళకి కట్టినట్టు చూపించారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. షాలిని రొమాన్స్ చేసింది జై దీప్ అహల్వాత్ తో.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)