Home

»

Latest News

షకీలా బయోపిక్‌: ఇది టాలీవుడ్ ‘డర్టీ పిక్చర్‌’.!

Nov 12, 2026 11:01AM

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా జీవితం ఇప్పుడు వెండితెరపైకి రాబోతోందా? టాలీవుడ్‌లో ఆమె బయోపిక్‌ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరమైన టాక్‌ వినిపిస్తోంది.

చిన్న సినిమాతోనే పెద్ద విజయాన్ని అందుకున్న ఓ దర్శకుడు.. షకీలా జీవిత కథను సినిమాగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారట. ఆమె సినీ ప్రయాణం, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన మలుపులను తెరపై చూపించాలనేది ఆ దర్శకుడి ఆలోచనగా తెలుస్తోంది.

ఈ సినిమాను సాధారణ బయోపిక్‌లా కాకుండా.. బాలీవుడ్ లో విద్యాబాలన్‌ నటించిన ‘ది డర్టీ పిక్చర్‌’ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారట. అందుకోసం బడ్జెట్‌ కూడా భారీగానే కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ కథకు సరిపోయే హీరోయిన్‌ కోసం అన్వేషణ మొదలైందట. షకీలా పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: శేఖర్ మాస్టర్‌కు యాక్సిడెంట్.. 'కాకా' షూటింగ్ నుంచి వస్తుండగా కారుని ఢీ కొట్టిన ట్రక్.!

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్‌’లో విద్యాబాలన్‌ నటించి మెప్పించారు. ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. మరి ఇప్పుడు షకీలా బయోపిక్ లో నటించే నటి కూడా అలాంటి మ్యాజిక్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

గ్లామర్‌ ప్రపంచంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన షకీలా జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. మరి ఆ కథను తెరపైకి తీసుకొచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? షకీలా పాత్రలో కనిపించబోయే నటి ఎవరు? అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీకు నచ్చవచ్చు: 
చచ్చిపోకముందే వెళ్లిపోండి.. ‘పైర్’ కథ వింటే కన్నీళ్లు ఆగవు.!
200 కోట్ల క్లబ్‌లో సీన్.. సూర్య అరుదైన రికార్డ్.!

 

 

 

[Shakeela Biopic, Glamour World, Tollywood Biopic, Shakeela Movie, The Dirty Picture]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com