
-సిల్క్ స్మితపై షకీలా సంచలన వ్యాఖ్యలు
-ఆ సినిమా చెప్పిందంతా అబద్దం
-అసలు నిజం నాకు మాత్రమే తెలుసు
-షూటింగ్ లో జరిగింది, తన ప్రాబ్లమ్ ఇదే
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ క్వీన్స్‌గా ఒక వెలుగు వెలిగిన నటీమణులు సిల్క్ స్మిత(Silk Smitha), షకీలా(Shakeela). వీరిద్దరి మధ్య వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. అయితే సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' సినిమాపై తాజాగా షకీలా సంచలన వ్యాఖ్యలతో పాటు ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడి చేసింది
షకీలా మాట్లాడుతూ డర్టీ పిక్చర్ లో చూపించినట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ప్రత్యర్థులం కూడా కాదు. సిల్క్ స్మిత తన మొదటి సినిమాలోనే హీరోయిన్ గా చేసింది. అందులో నేను తన సిస్టర్ క్యారక్టర్ పోషించాను. 1996 వ సంవత్సరంలో తాను మరణించిన తర్వాత నాకు 1999 లో మలయాళంలో స్టార్ డమ్ వచ్చింది. సిల్క్ స్మిత బతికి ఉంటే నాకు స్టార్ స్టేటస్ వచ్చేది కాదు. అసలు అందమైన మహిళని చూడలేదు. ఆమెకి చాలా గర్వం అని కూడా అనుకుంటారు. కానీ అటువంటి వ్యక్తి కాదు. వ్యక్తిగత సమస్యల వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేవి. అందుకే అందరితో ఫ్రీగా మాట్లాడే వారు కాదు.
Also read: Mahesh Babu: మహేశ్, ప్రశాంత్ నీల్ ఊహించని కాంబో.. క్రేజీ అప్‌డేట్!
ముఖ్యంగా నన్ను సిల్క్ స్మిత షూటింగ్ సెట్స్‌లో అందరి ముందు నన్ను తన్నిన వివాదం గురించి ఇప్పటికి చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే నేను 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఒక సినిమాకి సంబంధించిన షూటింగ్ లో నేను కేవలం ఒక టవల్ మాత్రమే కట్టుకుని రొమాంటిక్ సీన్ చేస్తుండగా, సిల్క్ స్మిత రూమ్‌లోకి ఎంటరై నన్ను గట్టిగా తన్నాలి. కానీ సిల్క్ స్మిత ఊహించని విధంగా నన్ను గట్టిగా తన్నింది. ఆ తర్వాత నన్ను గట్టిగా వాటేసుకొని నువ్వు టవల్ లో ఉన్నావు. తక్కువ దుస్తుల్లో నువ్వు టేక్స్ తీసుకుంటే సెట్స్‌లో ఇబ్బంది పడుతుందని భావించే ఒకే టేక్‌లో సీన్ ఓకే అవ్వాలని గట్టిగా తన్నానని చెప్పుకొచ్చింది. షకీలా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి .





