Home

»

Latest News

శేఖర్ మాస్టర్‌ వీడియో: యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇదే.!

Nov 12, 2026 2:09PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

శంషాబాద్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నైట్ షూటింగ్ ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని, అయ్యప్ప దయ వల్ల కారులో ఉన్న నలుగురూ సురక్షితంగా ఉన్నామని తెలిపారు. 

ప్రస్తుతం శేఖర్ మాస్టర్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అందుకే ఆ అయ్యప్ప దయ వల్ల క్షేమంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: శేఖర్ మాస్టర్‌కు యాక్సిడెంట్.. 'కాకా' షూటింగ్ నుంచి వస్తుండగా కారుని ఢీ కొట్టిన ట్రక్.!

స్నేహితులు, శ్రేయోభిలాషులు ఏమైందోనని ఆందోళన చెందుతూ ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని.. అందుకే ఈ వీడియో చేస్తున్నానని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం శేఖర్ మాస్టర్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్‌లో భాగంగా రాత్రి వేళల్లో పనిచేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన కారు ప్రమాదానికి గురవడం ఆందోళన కలిగించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

మీకు నచ్చవచ్చు:
రామ్ చరణ్ కోసం సుకుమార్ ప్లాన్.. RC17 షూటింగ్ ముహూర్తం ఫిక్స్.!
చచ్చిపోకముందే వెళ్లిపోండి.. ‘పైర్’ కథ వింటే కన్నీళ్లు ఆగవు.!

 

 

 

[Shekhar Master Accident, Hyderabad, Shekhar Master Reaction, Chiranjeevi, Kaaka Movie]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com