సికింద్రాబాద్ అమ్మవారి గుడిపై దాడి విషయంలో ప్రకాష్ రాజ్ ట్వీట్!
on Oct 19, 2024
రీసెంట్ గా సికింద్రాబాద్(secunderabad)లోని ముత్యాలమ్మ గుడి(muthyalamma temple)పై ఒక దుండగుడు దాడి చేసి అమ్మవారి విగ్రహాన్నికాలితో తన్నిన విషయం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.హిందువులు అయితే ఈ సంఘటనతో చాలా కోపంగా ఉండటంతో పాటుగా నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని సికింద్రాబాద్ లో ర్యాలీ చేస్తున్నారు.ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.
ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలు హిందూ సంఘాలు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(prakash raj)కి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.మొన్న తిరుపతి లడ్డు కల్తీ జరిగిందనే విషయంలో పవన్ కళ్యాణ్(pawan kalyan)హిందూ ధర్మం గురించి గట్టిగా మాట్లాడుతుంటే ఇష్యు పెద్దది చెయ్యద్దు అనే రీతిలో ట్వీట్లు చేసావు కదా!మరి ఇప్పుడు సికింద్రాబాద్ అమ్మ వారి టెంపుల్ విషయంలో కూడా ఇష్యు పెద్దదవకుండా నిరపరాధిని పట్టుకొని కఠినంగా శిక్షించమని గవర్నమెంట్ కి ఒక ట్వీట్ చెయ్యదు కదా అని పలువురు అంటున్నారు.
Also Read