Home

»

Latest News

ఆ ఇద్దరి హీరోలకి తల్లిగా నటించను.. శరణ్య సంచలన నిర్ణయం

Jul 25, 2026 6:18PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఎస్ జె సూర్య కాంబోలో వచ్చిన పంజా మూవీలో పవన్ కి తల్లిగా చేసి మెప్పించిన నటి శరణ్య(Saranya)ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కే ఇంపార్టెన్స్ లేదు, తల్లి క్యారెక్టర్స్ చేసే నటి కదా అని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గాను తన సత్తా చాటి బ్లాక్ బస్టర్ సినిమాల్లోనూ చేసింది. సంగీత ప్రియులు నిత్యం వినే నీరాజనం మూవీలోని 'నిను చూడక నేను ఉండలేను' సాంగ్ శరణ్య దే.   

 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శరణ్య మాట్లాడుతు 'సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ వర్సటైల్ యాక్టర్ మోహన్ లాల్ వంటి లెజండ్రీ నటులకి  తల్లిగా అస్సలు నటించను. ఎంత పెద్ద డైరెక్టర్ భారీ ఆఫర్ ఇచ్చినా, ఎంతటి రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఆ ఇద్దరి హీరోలకి మాత్రం మాతృమూర్తిగా నటించే ప్రసక్తే లేదు. ఒకవేళ అవకాశం వస్తే వారి సరసన హీరోయిన్‌గా చేస్తాను. స్కూల్ రోజుల నుంచే చదువుకుంటున్న సమయంలోనే రజినీకాంత్, మోహన్ లాల్ అంటే అపారమైన అభిమానం. వారిద్దరూ నా డ్రీమ్ హీరోలు . స్కూల్ రోజుల్లో రజినీకాంత్ ఫోటోలను సేకరించి క్లాస్‌రూమ్‌ డెస్క్‌పై అంటించుకునేదాన్ని. మనసులో ఎంతో కాలంగా హీరోలుగా, ఆరాధ్య దైవాలుగా కొలిచే నటులకు తెరపై అమ్మగా నటించడం నా వల్ల కాదు. వారి పట్ల ఉన్న గౌరవం, క్రష్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. శరణ్య 1987లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన "నాయగన్" (తెలుగులో నాయకుడు) మూవీతో  కథానాయికగా వెండితెర అరంగేట్రం చేశారు.  ఆ తర్వాత 90వ దశకంలో సౌత్ ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులందరి సరసన వరుస హిట్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే 1995లో నటుడు పొన్వన్నన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న శరణ్య, ఆ తర్వాత కుటుంబ బాధ్యతల కోసం దాదాపు 8 సంవత్సరాల పాటు వెండితెరకి  దూరంగా ఉన్నారు.

Also read: మంచు విష్ణు నెక్స్ట్ మూవీ ఇదేనా.. ఈ సారి సూపర్ హిట్ పక్కా!

తిరిగి  2003లో "అలై" చిత్రంతో శరణ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు,తల్లి క్యారక్టర్ లో    కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలందరికీ ఓ రకమైన "సినీ అమ్మ"గా మారిపోయారు. 2011లో వచ్చిన "తెన్మేర్కు పరువకాట్రు" చిత్రంలో ఆమె కనబరిచిన జీవకళాత్మక అభినయానికి ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డు (National Film Award) దక్కింది. రజీనీ కాంత్, మోహన్ లాల్ సరసన మాత్రం హీరోయిన్ గా చేయలేకపోయింది. 

Saranya, RajiniKanth, Mohan Lal

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com