మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే వైవిధ్యమైన సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సరికొత్త క్రైమ్ డ్రామా 'దృఢం'. అయితే ఈ సినిమా సక్సెస్ వన్ సైడ్ అయితే.. ఇందులో లేడీ కానిస్టేబుల్ పాత్రలో మెరిసిన నూతన నటి సానియా ఫాతిమా సరికొత్త ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో నయా క్రష్‌గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రంలో షేన్ నిగమ్ హీరోగా ఎస్ఐ పాత్రను పోషించారు. సినిమా ప్రథమార్ధంలో హీరోను కళ్లతోనే ఆరాధిస్తూ, ఎంతో అమాయకంగా కనిపించే లేడీ కానిస్టేబుల్ పాత్రలో సానియా ఫాతిమా అద్భుతంగా నటించింది. పోలీస్ స్టేషన్‌లో ఆమె ఇచ్చే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఆడియన్స్ అంతా వీరిద్దరి లవ్ ట్రాక్ బాగుంటుంది అనుకునే లోపే.. కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాల వైల్డ్ క్లైమాక్స్‌లో సానియా ఫాతిమా క్యారెక్టర్ ఇచ్చే మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్‌కు ప్రేక్షకులకు ఫ్యూజులు అవుట్ అయిపోతున్నాయి. అంతవరకు హోమ్లీగా కనిపించిన అమ్మాయిలోనే ఇంత క్రూరత్వం దాగుందా అనే రేంజ్‌లో ఆమె పండించిన వైవిధ్యమైన ఎమోషన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. సీనియర్ నటుల మధ్య ఎక్కడా తడబడకుండా సానియా ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌కు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ 'దృఢం' బ్యూటీ గురించే హాట్ టాపిక్‌గా మారింది. ఈ అందమైన కానిస్టేబుల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటా అని నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఈ సినిమా ప్రమోషన్స్, కొన్ని వెకేషన్ పిక్స్ మినహా ఆమెకు సంబంధించిన పాత చిత్రాల వివరాలేవీ లేకపోవడంతో.. ఇది సానియాకు డెబ్యూ మూవీనే అయి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
మొదటి సినిమాతోనే ఇటు నటనతోనూ, అటు గ్లామర్‌తోనూ మెప్పించిన సానియా ఫాతిమాకు రాబోయే రోజుల్లో టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ నయా క్రష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!





