భార్యతో విడాకులు, నరకం చూసా.. మరి సినిమాలకి ఎందుకు దూరం
on Feb 16, 2026
.webp)
-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సామ్రాట్ ఇంటర్వ్యూ
-సడన్ గా కెరీర్ ఆగడంపై ఏం చెప్పాడు
-చివరిగా ఎక్కుడు కనపడ్డాడు
-మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తాడా!
తెలుగు సినిమాని మిస్ చెయ్యని అసలు సిసలైన సినీ ప్రేమికులకి ప్రముఖ నటుడు సామ్రాట్(Samrat)గురించి తెలిసే ఉంటుంది. మెయిన్ హీరోగా సింగిల్ హ్యాండ్ తో సినిమాని నడిపించే పొజిషన్ కి దూరంగానే ఉన్నా,చాలా చిత్రాల్లో కథని టర్నింగ్ తిప్పే ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ లో కనిపించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ముఖ్యంగా పెళ్లి కొడుకు క్యారక్టర్ కి పేటెంట్ హక్కుని పొందినట్టుగా ఎక్కువ సార్లు సదరు క్యారక్టర్ లో కనిపించడం జరిగింది. బిగ్ బాస్ తెలుగు 2 కంటెస్ట్ గా కూడా పాల్గొన్న సామ్రాట్ కొంతకాలంగా ఎలాంటి చిత్రాల్లో కనిపించడం లేదు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అందుకు గల కారణాలని వివరించాడు.
సామ్రాట్ మాట్లాడుతు హీరోయిన్ తో పాటు పెళ్లి పీటలపై కూర్చోవడం, ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అవ్వడం.ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుండటంతో బోర్ కొట్టి రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత హర్షిత ని పెళ్లి చేసుకున్న కొంత కాలానికి నాపై గృహ హింస కేసు నమోదు నమోదయ్యింది. నా నుంచి విడిపోయే విషయంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు. కానీ హర్షిత తప్పుడు దారి ఎంచుకొని నేను నటుడు అనే ఉద్దేశ్యంతో నా పరువు పోవాలని ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. ఆ సమయంలో నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుంగిపోయాను. మా ఫ్యామిలీ కూడా చిన్నాభిన్నమైంది.ఆ తర్వాత మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో రెండు రోజులు జైలుకి వెళ్లి వచ్చాను. నాపై లేని పోనీ ఆరోపణలు రావడం నా కెరీర్ ని దెబ్బతీసిందని సామ్రాట్ చెప్పుకొచ్చాడు.
Also read: ఇంటి నుంచి బయటకి రమ్మన్న వ్యాఖ్యలపై స్పందించిన త్రిష.. నెక్స్ట్ జరిగేది ఇదేనా!
2024 లో వచ్చిన 'ధీర' అనే మూవీ సామ్రాట్ ప్రీవియస్ సినిమా లిస్ట్ లో ఉంది. సామ్రాట్ ఆ తర్వాత శ్రీ లిఖిత ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రెజెంట్ అయితే సామ్రాట్ ఖాతాలో ఎలాంటి చిత్రాలు లేవు. .వినాయకుడు, పంచాక్షరీ, ప్రేమ కావాలి,దేనికైనా రెడీ వంటి చిత్రాలు మంచి పేరు తీసుకురాగా పూర్తి పేరు సామ్రాట్ రెడ్డి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



