
నచ్చాల్సింది నీకు కాదు ప్రేక్షకులకి అంటూ తనని విమర్శలు చేసే వాళ్ళకి సమాధానాలు ఇస్తూనే సుమారు ఏడూ చిత్రాల వరకు హీరోగా చేసి మెప్పించాడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్ అనే టాగ్ లైన్ కూడా ఇచ్చేలా చేసుకున్న సంపూర్ణేష్ బాబు ఈ నెల 24 న న్యాచురల్ స్టార్ నాని ఒన్ మాన్ షో గా భావిస్తున్న ‘ది ప్యారడైజ్’లో ‘బిర్యానీ’ అనే ఒక కీ రోల్ లో చేస్తున్నాడు.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతు ప్యారడైజ్ నా నటనా ప్రయాణంలో ఒక పెద్ద మలుపు. ఈ సినిమా తర్వాత ఇకపై సోలో హీరోగా సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నన్ను కేవలం కామెడీ రోల్స్ లేదా స్పూఫ్ సినిమాలకే పరిమితం చేయకుండా, శ్రీకాంత్ ఒడెల వంటి దర్శకుడు ‘ది ప్యారడైజ్’లో 100% వైవిధ్యమైన, బలమైన నటనకి తావున్న క్యారక్టర్ ఇచ్చాడు. ఇకపై కథలో ప్రాధాన్యం ఉన్న విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లేదా కథని నడిపించే కీలకమైన క్యారెక్టర్స్ మాత్రమే చేస్తాను. హీరోగా 100% వినోదాన్ని పంచిన రోజులు ముగిశాయని, ఇకపై నటుడిగా 360 డిగ్రీల రూపాంతరం చెందడమే తన లక్ష్యమని సంపూ వెల్లడించారు.
.webp)
Also Read: మోక్షజ్ఞ మూవీలో పెద్ద ట్విస్ట్: ఫ్యాన్స్ ఏమంటున్నారు!
ప్యారడైజ్ లో నాని పోషిస్తున్న 'జాడల్'కి అత్యంత ఆప్తమిత్రుడిగా సంపూర్ణేష్ కనిపిస్తున్నాడు . ఇటీవలే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చేతిలో ఆయుధం, రక్తపు మరకలతో మునుపెన్నడూ చూడని తీవ్రమైన మరియు వైలెంట్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
[Sampoornesh Babu, The Paradise, Nani, No More Hero Rols, Srikanth Odela, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood]





