Home

»

Latest News

తొలి బిడ్డ రాక: సమంత ఇంట్లో ప్రత్యేక పూజలు.. ఫ్యామిలీ ఫొటోలు వైరల్.!

Nov 18, 2026 3:06PM

స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న ఆమె.. ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఇంట్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భర్త రాజ్‌తో పాటు కుటుంబ సభ్యులు, పెద్దల ఆశీర్వాదాల మధ్య కనిపించిన సమంత ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తొలి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్న సమంత, రాజ్ నిడిమోరు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, మహిళలు హాజరైనట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది.

ఒక ఫొటోలో రాజ్, సమంత ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో కుటుంబ పెద్దలు సమంతకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు. ఈ ఫొటోలకు సమంత కేవలం “Us” అనే చిన్న క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ ఒక్క పదంలోనే తమ కుటుంబ ఆనందాన్ని వ్యక్తం చేశారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సమంత, రాజ్ నిడిమోరు డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఉపాసన ఎమోషనల్.. ఆ సమయంలో రామ్ చరణ్.!

ఈ ఏడాది జూన్‌లో ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ సందర్భంగా సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. సినిమా పనులు పూర్తయ్యాక కొంతకాలం విరామం తీసుకుని మాతృత్వాన్ని ఆస్వాదించనున్నట్లు కూడా చెప్పారు. ఇప్పుడు బిడ్డ రాకకు ముందు కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు తీసుకుంటూ ప్రత్యేక పూజ నిర్వహించడం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

మొత్తానికి బిడ్డ రాక కోసం సమంత, రాజ్ కుటుంబం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తోంది. ఈ ప్రత్యేక వేడుక ఫొటోలు చూసిన అభిమానులు కాబోయే తల్లిదండ్రులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మీకు నచ్చవచ్చు: 
తరుణ్ భాస్కర్‌ సోల్‌మేట్.. కొడుకు జీవితంలో ఈషా స్థానం ఏంటో చెప్పిన తల్లి.!
ఆద్యను స్టేజ్‌పైకి వద్దన్న రేణు దేశాయ్.. కూతురి విషయంలో ఎందుకలా చేశారు.?

 

 

 

[Samantha Special Pooja, Samantha Pregnancy, Baby Countdown, Samantha Ruth Prabhu, Raj Nidimoru]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com