Home

»

Latest News

ప్రైమ్ వీడియోలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. చీకటి పడితే తలుపులు క్లోజ్ చేసుకోవాల్సిందే 

May 27, 2026 4:58PM


సెల్యులాయిడ్ పై సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకి ఉండే క్రేజే వేరు. ఆ కోవలోనే  ప్రేక్షకులని అలరించిన సరికొత్త మరాఠీ మిస్టరీ థ్రిల్లర్  ‘సాల్బర్డి’(salbardi)ఇప్పుడు ఓటీటీ ప్రియులని అలరించడానికి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది. ప్రముఖ నటి పూజా సావంత్  కీ రోల్ పోషించగా గ్రామీణ నేపథ్యంలో సాగే అంధవిశ్వాసాలు, రహస్య మరణాల చుట్టూ తిరుగుతుంది. ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో విడుదలవ్వగా నెల రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ఓటీటీలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇదొక చక్కటి ఎంపికగా నిలుస్తోంది.

 కథ మొత్తం 'సాల్బర్డి' అనే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో వరుసగా 10 సంవత్సరాల లోపు వయసున్న చిన్నపిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక్కడే ఉన్న మగపిల్లలు ఒకరి తర్వాత ఒకరు అదృశ్యమవుతూ, శవాలై కనిపిస్తుంటారు. ఈ వింత మరణాలు గ్రామంలో తీవ్ర భయాందోళనలని  రేకెత్తిస్తాయి. గ్రామస్థులంతా ఇది ఏదో క్షుద్ర శక్తులు, అపశకునాల వల్లే జరుగుతోందని నమ్ముతుంటారు. ఈ మిస్టరీని ఛేదించడానికి 'మనోరమ' అనే పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ గ్రామానికి వస్తుంది. ఆమె కేసు దర్యాప్తును లోతుగా విచారించే కొద్దీ, గ్రామంలోని ఒక పాత బంగళాకి  సంబంధించిన భయంకరమైన నల్లటి నిజాలు, స్థానిక రాజకీయ నాయకుల కుతంత్రాలు బయటపడతాయి. గ్రామస్థుల నుండి ఎదురయ్యే తీవ్ర వ్యతిరేకత, రాజకీయ ఒత్తిళ్లని  అధిగమించి ఆమె ఈ కేసుని  ఎలా ముగించిందనేదే అసలు కథ.


Also read: Upendra: హీరో ఉపేంద్ర ఇంట్లో పెళ్లి బాజాలు.. వరుడు కూడా ప్రముఖ హీరోనే

రమేష్ సాహెబ్‌రావ్ చౌదరి దర్శకత్వం వహించగా రోహిత్ శుక్రే స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. నటన పరంగా పూజా సావంత్ పోలీస్ ఆఫీసర్ మనోరమ పాత్రలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన బలంగా నిలిచింది.  సోనాలి కులకర్ణి, గష్మీర్ మహాజని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ లో  మెరిశారు. శశాంక్ షెండే, భరత్ గణేష్‌పురే, ఓంకార్ భోజనేలు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి అమర్ మోహిలే అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భయానక వాతావరణాన్ని మరింత పెంచింది. బుక్‌మై షోలో 600 కంటే ఎక్కువ ఓట్లతో 8.6/10 రేటింగ్‌ని, అలాగే ఐఎమ్‌డిబి (IMDb) లో ఏకంగా 9.1/10 రేటింగ్‌ను సొంతం చేసుకుని ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారు అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 2 గంటల 25 నిమిషాల సస్పెన్స్ రైడ్‌ ని  మిస్ అవ్వకండి.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com